
సాక్షి, భీమవరం: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జనసేన పార్టీ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. పవన్‌కల్యాణ్ వలంటీర్ల వ్యవస్థపై చేసిన ఆరోపణలతో పరువు పొగొట్టుకోగా భీమవరం పట్టణంలో ఆ పార్టీ నాయకులు చేసిన మరో చిల్లర ప్రయత్నం బెడిసికొట్టింది. భీమవరం పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.
పట్టణంలోని పైపుల చెరువు వద్ద విస్సాకోడేరు లేఅవుట్‌లో సుమారు 3 వేలకు పైగా ఇళ్లు నిర్మించాల్సి ఉండగా పేరొందిన కాంట్రాక్టర్‌తో మాట్లాడి లబ్ధిదారుల ఇష్ట్రపకారం ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 200 ఇళ్ల శ్లాబ్ నిర్మాణం పూర్తికాగా మరో 300 ఇళ్లు శ్లాబ్ లెవల్‌కు, 600 ఇళ్లు బెస్‌మెంట్ లెవల్‌లో ఉన్నాయి. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతలో రాజీపడకుండా నిర్మిస్తున్నాయి.
అయితే జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుతోపాటు కొంతమంది పార్టీ నాయకులు గత వారం ఇళ్ల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి ఇళ్ల నిర్మాణంపై విమర్శలు చేశారు. వారి ఆరోపణల్ని కాంట్రాక్టర్ పళ్ల ఏసుబాబు తిప్పికొట్టారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించినట్లు నిరూపిస్తే ఆయా ఇళ్లను కూలగొట్టి తిరిగి నిర్మిస్తానని బహిరంగ సవాల్ విసిరారు.
జగనన్న కాలనీ మునిగిపోతుందని, రోడ్డు అధ్వానంగా ఉందంటూ జనసేన చేసిన ఆరోపణను ఖండించారు. కాలనీకి రోడ్డు సౌకర్యం లేకుంటే ప్రతి రోజు 20 లారీల్లో వెయ్యి టన్నుల మెటీరియల్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. గునుపూడి లే అవుట్ భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ చేసిన మరో ఆరోపణను అక్కడ భూముల కొనుగోలుకు సహకరించిన తిరుమల విజయ్‌రామ్, భూములు విక్రయించిన రైతులు తప్పుపట్టారు.
లేఅవుట్‌కు 70 ఎకరాలు కొనుగోలు చేయగా ఎకరాకు రూ.కోటి 6 లక్షల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమచేశారని, రైతుల నుంచి ఎవరికై నా ముడుపులిచ్చినట్లు జనసేన నాయకులు మావుళ్లమ్మ ఆలయంలో దీపం ఆర్పి ప్రమాణం చేసి నిరూపించగలరా? అని సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment