సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తున్న సంఘం నాయకులు (ఫైల్)
ఖానాపూర్ ఆదిలాబాద్ : రెక్కలు ముక్కలు చేసుకున్నా.. బుక్కెడు బువ్వ కోసం అంగలార్చుతున్నారు. వెట్టిచాకిరి చేస్తూ.. అర్ధాకలితో అలమటిస్తున్నారు. కష్టపడి పనిచేస్తున్నా.. కనీస వేతనానికి నోచుకోవడంలేదు. బతుకుదెరువు కోసం అప్పులు చేయక తప్పడంలేదు. ఐదారు నెలలకోసారి వ చ్చే కొద్దిపాటి జీతం అప్పులకూ సరిపోవడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గిరిజన సంక్షేమశాఖ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి కూలీలు బతుకులు దినదిన గండంతో బతుకులు వెల్లదీస్తున్నారు.
అమలుకు నోచుకోని హామీలు..
ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహా ల్లో పనిచేస్తున్న 300 మంది దినసరి కూలీలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోంది. 30 ఏ ళ్లుగా పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదు. పైగా మూడు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. ఈ దినసరి కూలీల జీతభత్యాల విషయం ఆయా జిల్లా ల కలెక్టర్‌ల పరిధిలో ఉంటుంది.
దీంతో కార్మికులందరికీ వేతనాలు ప్రతీ నెల ట్రెజరీల ద్వారా ఇవ్వాల్సి ఉన్నా సక్రమంగా చెల్లించడం లేదని కార్మికులు వాపోతున్నా రు. సంక్షేమ శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం వేతనాలు చెల్లించాల్సి ఉన్నా, కలెక్టర్లతో జీవోలు విడుదల చేస్తూ నామమాత్రం జీతాలు చెల్లిసున్నారన్న విమర్శలున్నా యి. ఈ విషయాన్ని దినసరి కూలీల సంఘం ఆధ్వర్యంలో పలుసార్లు గిరిజన సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదు. దినసరి కూలీలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రభుత్వాలు హామీలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆచరణకు నోచుకోవడం లేదు.
శాశ్వత నియామకాల కోసం ఎదురుచూపు...
విధి నిర్వహణలో మరణించిన దినసరి కూలీల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లభించడం లేదు. 23 డిసెంబర్ 2011న ఆ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ జిల్లా అధికారుల సమావేశంలో దినసరి కూలీలను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. 2012 జనవరి 16లోగా సంబంధిత ఏటీడబ్ల్యూవోకు దినసరి కూలీల వివరాలు అందజేయాలని సూచించారు. ఇది దినసరి కూలీల్లో ఆశలు రేకెత్తించినా ఎంతోకాలం నిలువలేదు.
రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉన్నా...
రెండుమూడేళ్లు కొనసాగి నైపుణ్యం సంపాదించిన వారిని రెగ్యులరైజ్ చేయాలనే నిబంధన ఉన్నా అమలుకు నోచుకోవడంలేదు. పైగా ప్రభుత్వం వీ రితో వెట్టిచాకిరి చేయిస్తోంది. అయినప్పటికీ ప్ర భుత్వం ఏదో ఒకరోజు తమను రెగ్యులరైజ్ చేయకపోతుందా.. అన్న ఆశే వారిని పని చేసేలా చే స్తోంది. లేబర్ డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం శాశ్వత ప్రాతిపదికన గల ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగుల్ని ప్రభుత్వం నియమించకూడదు.
అంటే పనిలోకి తీసుకున్న వారు కొన్నాళ్ల పాటు పనిచేస్తే వారిని పర్మినెంట్ చేయాలి. కానీ.. 30 ఏళ్లుగా పని చేస్తున్నా ప్రస్తుతం రెగ్యులరైజ్ చేసిన దాఖలాలు లేవు. దినసరి కూలీల విషయంలో ప్రభుత్వం గాని, పనిచేయించుకుంటున్న శాఖలు గాని ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా వీరికి పని భద్రత, జీవన భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది.
నెరవేరని హామీలు...
జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో దినసరి కూలీలు ఇప్పటికే అప్పటి ముఖ్యమంత్రులు, ఆ శాఖ మంత్రులు, కమిషనర్‌లను కలిశారు. అలాగే 2016 సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి వారి గోడు వెల్లబోసుకున్నారు.
దీంతో తమను రెగ్యులరైజ్ చేస్తామని అధికారులు, సీఎం ఇచ్చిన హామీలు కూడా నెరవేరడం లేద ని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా తమకంటూ ఒక వేతన విధానం నిర్ణయించి, పెరిగిన నిత్యావసర ధరలు, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, దృష్టిలో ఉంచుకుని నెలనెలా వేతనాలు చెల్లిం చి పర్మినెంట్ చేయాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment