ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సాక్షి, హైదరాబాద్: దేశంలో మహిళా సాధికారతకు కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. అరవై ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత సోనియాదేనని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. గాంధీభవన్‌లో ఆదివారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా భేరీలో ఆయన ప్రసంగించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించేలా చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. ఈ చట్టం ద్వారానే తొలిసారిగా గ్రేటర్‌లో 75 మంది మహిళలు కార్పొరేటర్లు కాబోతున్నారన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో... గెలిచే వారికే టికెట్లు కేటాయిస్తామని, ఇందుకోసం ప్రైవేటు సంస్థల ద్వారా సర్వేలు చేయిస్తున్నామన్నారు. ఈ నెల 13న అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు శోభా ఓజా మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో మహిళలు చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కేంద్ర మాజీ మం త్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ హయంలోనే హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెం ట్ భట్టి విక్రమార్క, ఎంపీ హనుమంతరావు, ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, ఎంఎల్‌సీ ఆకుల లలిత పాల్గొన్నారు.
ఎంఐఎం బలహీనపడుతోంది...
దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌లోనే బలహీనపడుతోందని కర్ణాటక సమాచార శాఖ మంత్రి రోషన్ భేగ్ అన్నారు. ఎంఐఎంకు చెం దిన పలువురు నేతలు గాంధీభవన్‌లో ఆదివా రం కాంగ్రెస్‌పార్టీలో చేరారు. రోషన్ మాట్లాడుతూ ఎంఐఎం కర్ణాటకలో 27 కార్పొరేటర్ స్థానాలకు పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేదని, బీహార్‌లో కూడా అదే పరిస్థితని చెప్పా రు. హైదరాబాద్ ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ, హన్మంతరావు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలు: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని పలువురు టీఆర్‌ఎస్ స్థానిక నాయకులు మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రె డ్డి పార్టీలోకి వచ్చిన వారిని కాంగ్రెస్ కండువాలతో ఆహ్వానించారు.
మహిళా సాధికారత కాంగ్రెస్‌తోనే సాధ్యం
Published Mon, Jan 11 2016 3:43 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement