కేసీఆర్ది తుగ్లక్ పాలన: పొన్నాల | worked as tpcc chief my luck: ponnala laxmaiah | Sakshi
Sakshi News home page

కేసీఆర్ది తుగ్లక్ పాలన : పొన్నాల

Published Sun, Mar 8 2015 4:54 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

కేసీఆర్ది తుగ్లక్ పాలన:  పొన్నాల - Sakshi

కేసీఆర్ది తుగ్లక్ పాలన: పొన్నాల


హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్గా పనిచేయడం తన అదృష్టం అని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం ఎంఎల్ఏ ఉత్తమ్ కుమార్రెడ్డి టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గాంధీభవన్లో మాట్లాడిన ఆయన ఉత్తమ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని చెప్పారు. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ ది తుగ్లక్ పాలన అని, ఆయనకు పరిపాలన అనుభవం లేదని ఎద్దేవా చేశారు. కాగా, గాంధీభవన్లో మాజీ మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిని కాంగ్రెస్ నేతలు సన్మానించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement