వివిధ ప్రాజెక్టులకు భూసేకరణలో చేసే సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ నేతలకు గాంధీభవన్‌లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వివిధ ప్రాజెక్టులకు భూసేకరణలో చేసే సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ నేతలకు గాంధీభవన్‌లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూపీఏ హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టంపై ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు అవగాహన కల్పించారు. ప్రాజెక్టుల భూసేకరణ కోసం కేసీఆర్ సర్కారు తెచ్చిన జీవో123పై టీ కాంగ్రెస్ యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ముఖ్యనేతలు ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, డీకే అరుణతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.