నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్‌లలో ఐటీ దాడులు | IT Raids In Narayana And Sri Chaitanya Campus At Vijayawada | Sakshi
Sakshi News home page

నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్‌లలో ఐటీ దాడులు

Published Wed, Mar 4 2020 11:23 AM | Last Updated on Wed, Mar 4 2020 12:14 PM

IT Raids In Narayana And Sri Chaitanya Campus At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలోని బెంజ్‌ సర్కిల్‌ వద్ద గల నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్‌లలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.  ఉదయం 8 గంటల నుంచి ఐటీ అధికారులు నారయణ, శ్రీచైతన్య కాలేజీలలో తనిఖీలు జరుపుతున్నారు. నారాయణ క్యాంపస్‌కు వెళ్లిన ఐటీ అధికారులు.. అక్కడి రికార్డులను పరిశీలిస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కాలేజీ సిబ్బందిని బయటకు పంపించి సోదాలు చేస్తున్నారు. తాటి గడప, ఈడ్పుగల్లులోని క్యాంపస్‌లలో కూడా దాడులు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సమీపంలో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్‌ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్టులను స్వాధీనం చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement