
సాక్షి, కృష్ణ: జిల్లాలో మద్యం మత్తులో నారాయణ కాలేజీ బస్సు డ్రైవర్ హల్‌చల్ చేశాడు. పీకాల దాకా మద్యం తాగి విద్యార్ధులు ప్రయాణిస్తున్న బస్సును నడిరోడ్డుపై వదిలేశాడు. దీంతో, విద్యార్థులు తమను రక్షించాలంటూ కేకలు వేశారు.
వివరాల ప్రకారం.. మద్యం మత్తులో నారాయణ కాలేజీ బస్సు డ్రైవర్ నడిరోడ్డుపై హంగామా చేశాడు. కాలేజీ పూర్తైన తర్వాత ఉయ్యూరు నుంచి విద్యార్థులతో బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం సేవించిన డ్రైవర్..రోడ్డుపై బస్సును ప్రమాదకరంగా నడిపాడు. దీంతో, విద్యార్థులు కేకలు వేయడంతో పామర్రు మండలం కనుమూరు జాతీయ రహదారిపై బస్సును నిలిపివేశాడు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై ఉన్న డివైడర్‌ను పట్టుకుని హల్‌చల్ చేశాడు.
కాగా, డ్రైవర్ ప్రవర్తనతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. తమను రక్షించాలంటూ పెద్ద కేకలు వేశారు. ఈ క్రమంలో విద్యార్థులు నారాయణ స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. కానీ, విద్యార్థులు ఆందోళన చెందుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, డ్రైవర్ ప్రవర్తనతో విద్యార్థుల పేరెంట్స్, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment