
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో నారాయణ కళాశాలలో పనిచేస్తున్న వార్డెన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన భవాని అదే కాలేజీలో డిగ్రీ చదువుతూ అసిస్టెంట్ వార్డెన్గా పనిచేస్తోంది. అయితే కాలేజీ గదిలో ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది.
మాదాపూర్ నారాయణ కళాశాల సరస్వతి క్యాంపస్లో భవాని నెల క్రితమే హాస్టల్ వార్డెన్గా చేరినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవాని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి
Comments
Please login to add a commentAdd a comment