కూలిన నారాయణ కాలేజీ గోడ | In Nellore Narayana College Wall Injuries To Many Students | Sakshi
Sakshi News home page

ఆరుగురు విద్యార్థులకు గాయాలు

Published Sat, Jul 20 2019 7:28 PM | Last Updated on Sat, Jul 20 2019 8:03 PM

In Nellore Narayana College Wall Injuries To Many Students - Sakshi

సాక్షి, నెల్లూరు: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది.  కళాశాల గోడ కూలడంతో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని అరవింద్‌ నగర్‌లో ఉన్న నారాయణ జూనియర్‌ కళాశాలలో గోడ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ కొందరు విద్యార్థులు ఉండడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని కళాశాల సిబ్బంది వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్‌ కానీ, యాజమాన్యం కానీ ఇంతవరకూ స్పందించలేదు. ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ప్రస్తుతం నారాయణ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టాయి. కాలేజీ లోనికి ఎవ్వరినీ అనుమతించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement