నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కర్నూల్ జిల్లా నన్నూర్ నారాయణ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాలివి.. హాస్టల్‌లో భోజనం సరిగా లేదని విద్యార్థులు తిరగబడ్డారు. అంతేకాక కోపోద్రిక్తులైన విద్యార్థులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.