విద్యార్థిని అదృశ్యం
కర్నూలు: కలెక్టరేట్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్న విజయభవాని కూతురు కీర్తిశ్రీ (16) అదృశ్యమైంది. విజయభవాని భర్త శ్రీనివాసులు నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. వీరికి ముగ్గురు సంతానం. కీర్తిశ్రీ..నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరు లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 7వ తేదీన ఉదయం 9.30 గంటల సమయంలో బయటికి వెళ్తున్నట్లు తల్లికి చెప్పి కీర్తిశ్రీ ఇంతవరకు ఇంటికి రాలేదు. కూతురు కోసం కర్నూలుతో పాటు చుట్టుముట్టు గ్రామాల్లో స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసినా కనిపించలేదు. కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అరోరనగర్‌కు చెందిన తేజ యువకుడిపై అనుమానం ఉన్నట్లు సోమవారం మూడో పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇంటి నుంచి బయటికి వెళ్లేటపుడు గ్రీన్ టాప్, బ్లాక్ లోయర్ ధరించింది. ఐదు అడుగుల ఎత్తు, తెలుపు వర్ణం ఉంటుంది. ఆచూకీ తెలిస్తే 78422 73868 లేదా 94406 27735కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ శ్రీనివాసరావు కోరారు.