
సాక్షి, రాయచోటి రూరల్: కడపలోని నారాయణ కళాశాలకు రూ.10 లక్షలు జరిమానా విధించినట్లు ఆర్‌ఐఓ రవి పేర్కొన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు కళాశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కడపలోని నారాయణ కళాశాలలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించామన్నారు.
విద్యార్థిని ఆత్మహత్య విషయంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది తప్పు ఉన్నందున ఉన్నతాధికారులు జరిమానా విధించినట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి పెంచితే చర్యలు తప్పవని ఆర్‌ఐఓ పేర్కొన్నారు.