
సాక్షి, హైదరాబాద్: నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అనూష(16) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన మరువకముందే మాదాపూర్ నారాయణలో మరో విద్యార్థి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
విద్యార్థుల ఆత్మహత్య చేసుకోవడంపై మహిళా కమిషన్ ఆగ్రహం సీరియస్ అయ్యింది. ఎందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో వివరణ ఇవ్వాలని తెలంగాణ మహిళా కమిషన్ నారాయణ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది.