
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కి బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఆయన.. ఇవాళ లేఖ ద్వారా స్పందించారు.
మెయిల్ ద్వారా తనకు నోటీసులు అందాయని తెలిపిన బండి సంజయ్.. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో 15వ తేదీ కమిషన్ ఎదుట హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. అయితే.. బదులుగా ఈ నెల 18వ తేదీన కమిషన్ ఛైర్మన్ సూచించిన టైంకి హాజరుకాగలనని చెప్పారు.
అలాగే తాను కమిషన్ ఎదుట హాజరయ్యే అంశంపై పూర్తి సమాచారం అందించగలిగితే.. తాను విచారణ సమయానికి పూర్తి స్థాయి సన్నద్ధతో ఉంటానని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment