సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ పలుమార్లు విచారణ జరిపినా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయక పోవడానికి కారణం ఏమిటీ..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను అకస్మాత్తుగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎందుకు మార్చారు..? రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరా తీసిన సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ప్రజలు, పార్టీ కేడర్ నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రధానంగా ఈ రెండు ప్రశ్నలు ఎదురైనట్టు తెలిసింది.
ఈ నెల 20వ తేదీ నుంచి 27 దాకా ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’లో భాగంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అస్సోం, పుదుచ్చే రిలకు చెందిన బీజేపీ ›ప్రజాప్రతి నిధులు చేపట్టిన క్షేత్ర స్థాయి పర్యటనలు ఆదివా రంతో ముగిశాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు నుంచి తమకు అందిన సమాచారాన్ని ఫీడ్‌బ్యాక్ రిపోర్ట్ రూపంలో ఈ నెల 28–31 తేదీల మధ్య బీజేపీ జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఎమ్మెల్యే ప్రవాస్ యోజన తెలంగాణ ఇన్‌చార్జ్ భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు.
చదవండి: అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ట్వీట్
ఇంకా ఏం చెప్పారంటే....
►ఎమ్మెల్సీ కవిత అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, చర్యలు తప్పవంటూ జాతీయ అగ్రనాయకత్వం మొదలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యనేతల వరకు ప్రక టనలు గుప్పించి.. ఈ దిశలో ఏ చర్యలు చేపట్టకపోవడం పార్టీకి నష్టం చేసిందని కొందరు తమ అభిప్రాయం చేసినట్టు తెలిసింది.
►బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడం కూడా ఎన్నికలకు సన్నద్ధమ వుతున్న దశలో పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి కారణమైందని కొందరు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం.
►పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో ప్రస్తుతం పోటీ చేయాలనుకుంటున్న నేతల బలం సరిపోతుందా.. స్థానికంగా నాయకుల పని తీరు, సమన్వ యం ఎలా ఉంది వంటి అంశాలను పలువురు ప్రస్తావించినట్టు తెలిసింది.
►పార్టీ సంస్థాగతంగా అక్కడక్కడ బలంగా లేకపోవడం, బూత్‌కమిటీలతో సహా ఆయా కమిటీలు పూర్తిస్థాయిలో నియమించకపోవ డం, ఆయా నియోజకవర్గాల స్థాయిల్లో నాయకుల మధ్య సమన్వయ సమస్యలు, తదితర అంశాలు వీరి దృష్టికి వచ్చింది.
►తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి, వివిధవర్గా లకు చేకూరిన ప్రయోజనాలు, కేంద్ర పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీయ డంతో పాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థి తిపై ప్రజల నుంచి సమాచారం సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment