నారాయణ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నం
కడప: నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న మనీషా(16) తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను హుటాహుటిన కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది.
కడప నగర శివారులోని నారాయణ జూనియర్ బాలికల కళాశాల హాస్టల్‌లో ఆగస్టు 17న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినులు మనీషా(16), నందిని(16) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నారాయణ కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే వీరిద్దరు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కాగా, ఇప్పటివరకు 14 మంది నారాయణ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.