Narayana student
-
‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
యాజమాన్యమే బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ హైదరాబాద్: రాజధానిలోని ప్రగతినగర్ నారాయణ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పంటకుదురుకు చెందిన వంశీధర్ కుమారుడు నాగసాయి.. ప్రగతినగర్ నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం హాస్టల్లో నాగసాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే నాగసాయి మృతి విషయం తెలుసుకున్న అతని బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్దకు చేరుకుని, ఈ ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కళాశాల నిర్వాహకుల ఒత్తిడి మూలంగానే నాగసాయి మృతి చెందాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా, నారాయణ కళాశాలల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. నారాయణ విద్యాసంస్థల చైర్మన్, ఏపీ మంత్రి నారాయణ దిష్టిబొమ్మను బర్కత్‌పుర చౌరస్తాలో దగ్ధం చేశారు. గత 15 రోజుల నుంచి నారాయణ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. -
నారాయణ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నం.
-
నారాయణ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నం
కడప: నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న మనీషా(16) తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను హుటాహుటిన కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది. కడప నగర శివారులోని నారాయణ జూనియర్ బాలికల కళాశాల హాస్టల్లో ఆగస్టు 17న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినులు మనీషా(16), నందిని(16) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నారాయణ కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే వీరిద్దరు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కాగా, ఇప్పటివరకు 14 మంది నారాయణ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. -
'అఖిల్ మృతిపై అనుమానాలున్నాయి'
కృష్ణా జిల్లా నిడమనూరులోని నారాయణ కళాశాల విద్యార్థి అఖిల్‌రెడ్డి ఆత్మహత్యపై అతడి తండ్రి సందేహాలు వ్యక్తం చేశారు. తన కుమారుడు మృతిపై అనుమానాలున్నాయని, ఎలాంటి అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కూడా లేవన్నారు. నారాయణ కాలేజీ యాజమాన్యం రకరకాల కథలు చెప్పుతోందని ఆయన అన్నారు. అఖిల్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణకు చెందిన కాబట్టి తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని అన్నారు. కాగా అఖిల్ రెడ్డి మృతదేహానికి శనివారం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయింది. నిన్న సాయంత్రం అఖిల్ కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.