కడప ఎడ్యుకేషన్ : నారాయణ కళాశాలలో ఈనెల 17న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు నందిని, మనీషాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై న్యాయ విచారణ నిర్వహించాలని వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. కడపలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సంధ్యా సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ హరితా హోటల్ వరకు సాగింది. అనంతరం కోటిరెడ్డి సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.
యూనియన్ జిల్లా అధ్యక్షుడు అలూరు ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ.. నందిని, మనీషాలవి ముమ్మాటికి హత్యలేనన్నారు. ఇందుకు కారణమైన కళాశాల సిబ్బంది, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల అనుమతులను రద్దు చేయాలని కోరారు. మరణించిన విద్యార్థుల ఇళ్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లి.. దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు తిష్ట వేయడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు నిత్య పూజయ్య, నాగార్జున రెడ్డి, మాసిన్, పెంచలయ్య, సందీప్, అబ్బాస్, సలావుద్ధీన్, సోహెల్, వెంకటేష్ పాల్గొన్నారు.
నందిని, మనీషాల మృతిపై న్యాయ విచారణ జరపాలి
Published Sun, Aug 23 2015 3:43 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM
Advertisement