ఆంధ్రప్రదేశ్లో మహిళా వ్యతిరేక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. మహిళలపై దాడులు, ఆత్మహత్యలు కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. సోమవారం పార్టీ కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ నేరస్తులకు అండగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన ప్రిన్సిపాల్ బాబూరావును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె డిమాండ్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించి తక్షణమే బాబూరావుపై విచారణకు ఆదేశించాలన్నారు.