టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంటా ఒక రాజకీయ వ్యాపారి అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లో ఆఫర్ ఉందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని అన్నారు. పదవుల కోసం నమ్మినవాళ్లను నట్టేట ముంచిన ఘన చరిత్ర గంటాదని చురకలంటించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు.