baburao
-
‘పవన్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి’
నగరంపాలెం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ రాజ్యాంగ పదవిలో ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నందువల్ల.. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని జైభీమ్ కార్మిక సంక్షేమ సంఘం కూటమి అధ్యక్షుడు పిల్లి బాబురావు డిమాండ్ చేశారు. కలెక్టర్ బంగ్లారోడ్డులోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠికి గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆయన, కూటమి సభ్యులు ఫిర్యాదు చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఎవరైనా హేళన చేస్తే వారి అంతు చూస్తానంటూ బలవంతపు హిందూ మతమార్పిడులను ప్రేరేపిస్తున్నారని, ఇది రాజకీయకుట్ర అని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ప్రధాని మోదీ కూడా ఉన్నారని, వారివురిపై దేశద్రోహం, రాజద్రోహం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయని, వాటిని విస్మరించి లడ్డూలపై తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. కూటమి సభ్యులు ఎన్.నీలాంబరం, కొండపల్లి విల్సన్ పాల్గొన్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా బదిలీల నుంచి కొందరి మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీల నుంచి కొంతమంది డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపు పొందారని ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబూరావు మంగళవారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ లాలూప్రసాద్ తదితరులు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీజీజీడీఏ) ఆఫీస్ బేరర్లమని చెప్పుకుని బదిలీల నుంచి మినహాయింపు పొందారని, ప్రభుత్వం ఇచి్చన ఉత్తర్వుల ప్రకారం వీరు మినహాయింపులకు అర్హులు కారని బాబూరావు తెలిపారు.పల్లం ప్రవీణ్ 19 ఏళ్లుగా, లాలూప్రసాద్ 12 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఆరేళ్లకు పైబడి ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి ఉన్నా.. అధికారులు వీరిని హైదరాబాద్ నుంచి కదపడం లేదని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని ఆయన కోరారు. కాగా, ఆయుష్ డిపార్ట్మెంట్లో బదిలీలు చాలా అన్యాయంగా జరిగాయని పలువురు డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు తీసుకొని ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారని పలువురు అభ్యర్థులు మండిపడుతున్నారు. ఒక డాక్టర్ తన భర్త చనిపోయినట్లు విడో ఆప్షన్ కింద దరఖాస్తు చేస్తే, విడో సరి్టఫికెట్ చింపేసి ఆమెను బదిలీ చేయకుండా నిలిపివేశారు. దీంతో ఆమె ఆయుష్ అధికారులను నిలదీయగా అసలు ఆ సర్టిఫికెట్ పెట్టలేదని బుకాయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. లక్షలాది రూపాయలు లంచంగా తీసుకొని ఇష్టమైన వారికి నచి్చన చోట బదిలీ చేపట్టారని చెబుతున్నారు. అలాగే రీజనల్ డైరెక్టర్ పోస్టును అర్హులకు కాకుండా ఇతరులకు ఇచి్చనట్లు ఒక డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
పదవి నుంచి చింతపల్లి ఎంపీపీ తొలగింపు
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : చింతపల్లి ఎంపీపీ వంతాల బాబూరావును పదవి నుంచి తొలగించాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఎన్నికల అథారిటీ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిషత్ ఎన్నికల సమయంలో ఎంపీపీ ఎన్నికల్లో 20 మంది ఎంపీటీసీల్లో 9 మంది ఇండిపెండెంట్లు బాబూరావును బలపర్చగా, మరో 9 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థి అనూషదేవిని బలపర్చారు. ఇద్దరికీ సమానంగా సభ్యుల మద్దతు రావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్రనాథ్ లాటరీ తీశారు. డ్రాలో బాబూరావుకు ఎంపీపీ పదవి వరించింది. ఎన్నికల నామినేషన్ దాఖలు సమయంలో బాబూరావు ఆయనపై ఉన్న కేసుల వివరాలను నమోదు చేయలేదని అనూషదేవి కోర్టును ఆశ్రయించడంతో పాడేరు సబ్ కలెక్టర్ విచారణ జరిపారు. బాబూరావుపై కేసులు ఉన్నట్టు తేలడంతో పదవికి అనర్హుడిగా పేర్కొంటూ ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కోరాబు అనూషదేవిని ఎంపీపీ పదవి వరించనుంది. (క్లిక్ చేయండి: విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..) -
నందిగం సురేష్‌కు బాబూరావు క్షమాపణ
ఉద్దండరాయునిపాలెం (తాడికొండ): కొందరు వ్యక్తులు తనను ఆర్థికంగా ఆదుకుంటానని ప్రలోభపెట్టి ఎంపీ నందిగం సురేష్‌పై ఆరోపణలు చేయించారని బత్తుల బాబూరావు కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పోలీసు ఉద్యోగానికి దూరమైన బత్తుల బాబూరావు సిఫార్సు నిమిత్తం ఎంపీ నందిగం సురేష్‌ను కలవగా దాడి చేశారనే కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఎంపీని కలిసి క్షమాపణ చెప్పారు. ఆదివారం రాత్రి తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఎంపీ నందిగం సురేష్ నివాసానికి వెళ్లిన బాబూరావు తీరని అన్యాయం చేశానని ఎంపీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: అవినీతికి ‘సీమెన్స్’ ముసుగు కొందరు వ్యక్తులు తనను ప్రలోభాలకు గురిచేసి ఆదుకుంటానని చెప్పినందున అలా మాట్లాడానే తప్ప ఈ వ్యవహారం రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం అవుతుందని తాను ఊహించలేదన్నారు. జరిగిన ఘటనలో ఎంపీ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. కొన్ని చానళ్లలో వస్తున్న కథనాలు ఉద్దేశపూర్వకంగా, తనను తప్పుదారి పట్టించి మాట్లాడించిన మాటలే తప్ప వాటిలో నిజం లేదన్నారు. -
కెఫే నిలోఫర్ ప్రాసెసింగ్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిలోఫర్ చాయ్.. బహుశా ఈ పేరు తెలియని హైదరాబాదీయులు ఉండరేమో. భాగ్యనగర వాసులే కాదు విదేశీయులు సైతం ఇక్కడి గరమ్ గరమ్ చాయ్ రుచి చూసినవారే. నాలుగు దశాబ్దాల నిలోఫర్ ప్రస్థానంలో ఇప్పటికే కోటి మందికిపైగా వినియోగదార్ల మనసు చూరగొంది. రెండవ తరం రాకతో సంస్థ విస్తరణ బాట పట్టింది. బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తుల తయారీతో మొదలుకుని ప్రీమియం లాంజ్‌ల ఏర్పాటు, టీ పొడుల విక్రయంలోకి రంగ ప్రవేశం చేసింది. ప్రాసెసింగ్ ప్లాంట్ సైతం నెలకొల్పుతున్నట్టు కెఫే నిలోఫర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న ఏబీఆర్ కెఫే అండ్ బేకర్స్ వ్యవస్థాపకులు అనుముల బాబురావు వెల్లడించారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. అత్యాధునిక యంత్రాలతో.. తయారీ కేంద్రం కోసం శంషాబాద్ దగ్గరలో తెలంగాణ ప్రభుత్వం ఆరు ఎకరాలను కేటాయించింది. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 30 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న ఈ అత్యాధునిక ప్లాంటుకు రూ.30 కోట్లు పెట్టుబడి చేస్తున్నాం. ఇక్కడ టీ పొడుల ప్రాసెసింగ్ యూనిట్ ఏడాదిలో, డ్రై కేక్స్, బిస్కట్స్ తయారీ కోసం బేకరీ ప్రాసెసింగ్ యూనిట్ æ2023లో అందుబాటులోకి వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఏడాదే నాల్గవ కేంద్రం.. హిమాయత్‌నగర్‌లో ప్రీమియం లాంజ్‌ను డిసెంబరులో ప్రారంభించనున్నాం. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రానుంది. ఒకేసారి 250 మంది వినియోగదార్లకు సేవలు అందించే వీలుంది. ఈ సెంటర్‌కు 150 మందిని నియమిస్తాం. బంజారాహిల్స్‌లో ఉన్న ప్రీమియం లాంజ్ 2019లో ప్రారంభమైంది. లక్డీకాపూల్‌లో తొలి కెఫేకు సమీపంలోనే రెండవ కేంద్రాన్ని 2016లో ఏర్పాటు చేశాం. మా కెఫేలకు రోజుకు 20,000 మంది కస్టమర్లు వస్తుంటారు. రెండేళ్లలో తెలంగాణలో.. టీ పొడులను మూడు రకాల రుచుల్లో పరిచయం చేశాం. రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా ఇవి లభిస్తాయి. రూ.10 మొదలుకుని రూ.650ల ప్యాక్ వరకు తీసుకొచ్చాం. సంస్థ ఆదాయంలో ఆన్లైన్ వాటా 20 శాతం ఉంది. ఆన్లైన్లో బుక్ చేస్తే చాయ్ సైతం ప్రత్యేక బాక్స్ ద్వారా హైదరాబాద్‌లో డెలివరీ చేస్తున్నాం. 300ల రకాల బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. సంస్థలో 250 మంది ఉద్యోగులున్నారు. -
సీనియర్ ఫిలిం ఎడిటర్ కన్నుమూత..
సాక్షి, చెన్నై: జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ ఫిలిం ఎడిటర్ కె బాబురావు అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళం, హిందీ భాషల చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. అందులో అనేక విజయవంతమైన చిత్రాలతో పాటు చక్కటి కథాంశంతో ప్రేక్షకులను అలరించిన చిత్రాలు అధికంగా ఉన్నాయి. కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందించిన పలు చిత్రాలకు బాబురావు ఎడిటర్‌గా పనిచేశారు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం సాగింది. బాబురావు ఎడిటర్‌గా పనిచేసిన సిరిసిరిమువ్వ సినిమాకు గానూ ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. బాబురావు మృతి పట్ల దక్షిణాది ఇండస్ట్రీ సంతాపం తెలియజేసింది. -
‘లైసెన్స్’ సాయం
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలో ఉన్న వాహనాల సంఖ్యలో సగం కూడా డ్రైవింగ్ లైసెన్సులు లేవు. ఈ నేపథ్యంలో లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న కేసుల్లో అత్యధికం ఈ ప్రాంతంలోనే నమోదవుతున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ డీసీపీ–2 బాబూరావు ప్రత్యేక మేళా ఏర్పాటు చేశారు. దీనికి వచ్చిన స్పందన చూసి ప్రతి ఠాణాలోనూ హెల్ప్‌డెస్క్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి ఇవి పని చేయనునున్నాయి. మరోపక్క వేసవి తీవ్రత నేపథ్యంలో వాహనచోదకులకు ఉపశమనం కోసం పాతబస్తీలోని జంక్షన్లలో పరదాలు ఏర్పాటు చేస్తున్నారు. కారణాలనేకం... నిరక్షరాస్యత, అవగాహన లేమి, అందుబాటులో లేని వనరులు, తదితర కారణాల నేపథ్యంలో పాతబస్తీకి చెందిన అనేక మంది వాహనచోదకులు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోవట్లేదు. గతంలో సౌత్‌జోన్ అదనపు డీసీపీగా పని చేసిన బాబూరావుకు ఈ విషయంపై అవగాహన ఉండటంతో ఆయన ఈ అంశాన్ని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. పాతబస్తీ ప్రజల కోసం డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఆర్టీఏ అధికారులతో సంప్రదింపుల అనంతరం అనిల్‌కుమార్ ఫలక్‌నుమా ప్రాంతంలో సోమ–మంగళవారాల్లో ప్రత్యేక మేళా ఏర్పాటు చేయించారు. దాదాపు 1200 మంది రిజిస్టర్ చేసుకోవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేయించుకున్నారు. ఇలా వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో శాశ్వత ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఠాణాలోనూ డెస్క్ ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహణ కోసం 20 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్సుల స్లాట్స్ బుక్ చేయడం, ఆన్లైన్ టెస్ట్‌కు సంబంధించిన అంశాలను స్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం వంటివి వీరికి నేర్పారు. మేళాలో విధులు నిర్వర్తించిన ఈ కానిస్టేబుళ్లు బుధవారం నుంచి వారి ట్రాఫిక్ ఠాణాల్లోనే ఉంటారు. వీరి నేతృత్వంలో పాతబస్తీలోని 12 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పరిధులకు చెందిన వారు ఎవరైనా ఆర్టీఏ స్లాట్ బుక్ చేసుకోవడానికి ఈ డెస్క్‌ను సంప్రదిస్తే, సిబ్బంది స్లాట్ బుక్ చేయడంతో పాటు ఆన్లైన్ టెస్ట్‌పై అవగాహన కల్పిస్తారు. ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత ట్రాక్ టెస్ట్‌కు అవసరమైన స్లాట్స్ బుక్ చేయడం, సహాయం చేయడం వంటి విధులు నిర్వర్తిస్తారు. బుధవారం నుంచి ఈ డెస్క్‌లు పని చేయనున్నాయి. ఇదీ పాతబస్తీ పరిస్థితి 2017 జనవరి–ఏప్రిల్ మధ్య డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడానికి సంబంధించి 8727 కేసులు నమోదయ్యాయి. ఇందుళక్ష సౌత్ డిస్ట్రిట్లోనే 5483 (62.82 శాతం) నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో నగర వ్యాప్తంగా 5735 కేసులు నమోదు కాగా... పాతబస్తీతో కూడిన సౌత్ డిస్ట్రిట్లోనే 3138 (54.71 శా>తం) రిజిస్టర్ అయ్యాయి. పరదాలు ఏర్పాటు చేస్తున్నాం ‘డ్రైవింగ్ లైసెన్స్‌లేని వాహనచోదకులకు ఈ హెల్ప్‌డెస్క్‌లు సహకారం అందిస్తాయి. మరోపక్క వేసవి నేపథ్యంలో పగటి పూట ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగుతున్న వాహనచోదకులు ఎండ వేడితో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీలోని రద్దీ జంక్షన్లలో పరదాలు ఏర్పాటు చేస్తున్నాం. బహదూర్‌పుర చౌరస్తాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. శాలిబండ, చంద్రాయణగుట్ట జంక్షన్లలో బుధవారం ఏర్పాటు చేయనున్నాం. వారంలో మరికొన్ని చోట్ల ఇవి అందుబాటులోకి వస్తాయి. పరదాలు ఏర్పాటు చేయడంతో పాటు పాయింట్ డ్యూటీలో ఉండే సిబ్బంది, అధికారులు వీటిని నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నాం.’ – కె.బాబూరావు, ట్రాఫిక్ డీసీపీ–2 -
భోజ్యేషు బాబు
బజార్‌ఘాట్‌లోని నిలోఫర్ కేఫ్ అందరికీ తెలిసిందే. అయితే కేఫ్ యజమాని అనుముల బాబురావు సేవా దృక్పథం కొంతమందికే తెలుసు. ఎంతో కష్టపడి హోటల్లో క్లీనర్ నుంచి ఓనర్‌గా ఎదిగిన బాబురావు.. తనవంతుగా సమాజానికి సేవ చేయాలని సంకల్పించాడు. ప్రతిరోజూ 800 మందికి ఉచితంగా భోజనం అందజేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. బాబురావు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా దేగ్గం మండలం లగ్గాలా గ్రామం. మహారాష్ట్రలోని పెద్దనాన్న కిరాణా దుకాణంలో పనిచేస్తూ చదువుకున్నాడు. పదో తరగతిలో పుస్తకాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన తండ్రి పాడి ఆవును విక్రయించి రూ.125 ఇచ్చాడు. అది చూసి బాబురావు ఎంతో చలించిపోయాడు. ఆర్థిక పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేశాడు. మొదట ఓ బట్టల షాప్‌లో పనిచేశాడు. తర్వాత కింగ్‌కోఠిలోని రాక్ సీ హోటల్లో క్లీనర్‌గా చేరాడు. అక్కడి నుంచి నిలోఫర్‌కు వచ్చాడు. బాబురావు పనితనాన్ని మెచ్చిన హోటల్ యజమాని టీ మాస్టర్‌గా, మేనేజర్‌గా ప్రమోట్ చేశాడు. 1993లో ఏకంగా అదే హోటల్‌ను అద్దెకు తీసుకున్న బాబురావు... తర్వాత దాన్ని కొనుగోలు చేశాడు. బాబురావు చక్కటి టీ మాస్టర్.. ఆయన టీకి అందరూ ఫిదా అవ్వాల్సిందే. కష్టాలు కదిలించాయి... నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రులకు వచ్చే వారి కష్టాలు బాబురావును కదిలించాయి. వారికి తనవంతుగా సేవ చేయాలన్న ఆలోచనతో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశాడు. 15 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఉచిత భోజనం నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉదయం 500 మందికి టిఫిన్, మధ్యాహ్నం 300 మందికి ఉచితంగా భోజనం అందజేస్తున్నాడు. ఇందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి జీతాలు ఇస్తున్నాడు. క్యాన్స్ర్ చికిత్స పొందుతూ ఎవరైనా మృతి చెందితే స్వగ్రామానికి తరలించేందుకు ఆర్థిక సహాయం అందజేస్తున్నాడు బాబురావు. సిబ్బందికి గుర్తింపు... కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపునిస్తారు బాబురావు. ఆయన దగ్గర ఒక్కొక్కరు 15–20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. సిబ్బంది అందరికీ వంటల తయారీలో ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నారు. టీ, బిస్కెట్స్, కేక్‌లు, కేఫ్‌లో అందించే ప్రత్యేక రుచుల తయారీ గురించి నేర్పిస్తారు. ప్రావీణ్యమున్న వారికి పదోన్నతులు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడి విధానంపై ఆసక్తితో యశోద ఫౌండేషన్ 20 మందికి శిక్షణనిచ్చే బాధ్యతను బాబురావుకు అప్పగించింది. భవిష్యత్తులో ఆస్పత్రి.. వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తూ నమ్మకంగా పనిచేసినప్పుడే విజయం వరిస్తుంది. మేం తక్కువ ధరలోనే నాణ్యమైన టీ, బిస్కెట్స్ అందిస్తాం. కేఫ్ నిలోఫర్ ఉస్మానియా బిస్కెట్లు నగరంలోని 36 షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఆదాయంతోనే పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్‌లో ఓ ఆస్పత్రి నిర్మించాలని అనుకుంటున్నాను. – అనుముల బాబురావు -
ఆదుకోమంటే అరెస్ట్ చేస్తారా ?
సీపీఎం రాజధాని కమిటీ కన్వీనర్ బాబూరావు కార్మికులకు న్యాయం చేయాలంటూ ధర్నా తాత్కాలిక సచివాలయం వద్ద ఉద్రిక్తత ఐదుగురు నాయకులు అరెస్ట్ గుంటూరు : ప్రమాదానికి గురైన కార్మికులను ఆదుకోవాలని అడిగితే అరెస్ట్‌లు చేస్తారా? అంటూ రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కమిటీ కన్వీనర్ సిహెచ్.బాబూరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో సోమవారం గోడ కూలిన సంఘటనలో ఐదుగురు కూలీలకు గాయాలైన సంగతి తెలిసిందే. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం కార్యకర్తలు సచివాలయంలో ఉన్న మంత్రి నారాయణకు మంగళవారం వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. మల్కాపురం వద్దనే పోలీసులు సీపీఎం నాయకులను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసులు వారిని బలవంతంగా వ్యాన్‌ను ఎక్కించి అమరావతి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎందరిని బలి చేస్తారు? ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. సచివాలయ నిర్మాణంలో ఎంతమంది కార్మికులను బలి చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోతే గుట్టు చప్పుడు కాకుండా చేయాలని అధికారులు, మంత్రులు ప్రయత్నించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమాచారం తెలుసుకుని పోరాటం చేస్తే ఒకరికి రూ. 9 లక్షలు, మరొకరికి రూ. 20 లక్షలు నష్ట పరిహారం ఇచ్చారని బాబూరావు వివరించారు. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో గాయపడినవారికి పరిహారం ప్రకటించాలని కోరుతుంటే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదం జరిగినపుడు మంత్రి నారాయణ సచివాలయంలోనే ఉన్నారని, కనీసం బాధితులను కూడా ఆయన పరామర్శించ లేదన్నారు. ఇప్పటికైనా మంత్రి నారాయణ బాధితులకు కనీసం రూ. 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక శాఖ పత్తాలేకుండా పోవడం వల్లే తాము బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాజధాని డివిజన్ కమిటీ కార్యదర్శి ఎం.రవి, సీఐటీయూ రాజధాని డివిజన్ కమిటీ కార్యదర్శి జె.నవీన్ ప్రకాష్, రాజధాని డివిజన్ కమిటీ యువజన ఉపాధ్యక్షులు లెనిన్, సీపీఎం డివిజన్ నాయకులు జె.వీర్లంకయ్య, రైతు నాయకులు పాబత్తుల వెంకటేశ్వరరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఎమ్మెల్యే అనితది మొసలి కన్నీరు
ఎమ్మెల్యే అనితది మొసలి కన్నీరు వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బాబూరావు పాయకరావుపేట: పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మంత్రి కావాలనే ఉద్దేశ్యంతో తన కుటుంబ సమస్యను దళితుల సమస్యగా అసెంబ్లీలో లేవనెత్తుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు ఆరోపించారు. పాయకరావుపేటలో ఆయన విలేకరులతో బుధవారం మాట్లాడుతూ అనిత తన కుటుంబ సమస్యను దళితుల సమస్యగా చూపించి మొసలి కన్నీరు పెట్టడం సమంజసం కాదన్నారు. ఆమె నియోజకవర్గ ప్రజల కోసం కన్నీరు కారిస్తే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాల్సింది పోయి నా కుటుంబానికి ,నా పిల్లలకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించడాన్ని తప్పుపట్టారు. నగిరి ఎమ్మెల్యే రోజా ఆమెను అవమానపర్చినట్టు ఎక్కడా ఆధారాలు లేవని చెప్పారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మాటలను అనిత అన్వయించుకుని సమస్య లేవదీయడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసి, రావెల కిశోర్ మంత్రి పదవిని కాజేసేందుకు ఆమె వేసిన ఎత్తున అని విమర్శించారు. అసెంబ్లీ జరుగుతున్న సభ తీరు చూస్తే కౌరవులు, పాండవుల మధ్య యుద్ధంలా ఉందని, అంతిమ విజయం వైఎస్సార్ సీపీదేనని గుర్తుంచుకోవాలన్నారు. ఆయన వెంట నాయకులు ధనిశెట్టి కృష్ణ, బి.వి.రమణ తదితరులు ఉన్నారు. -
తమ్ముణ్ణి కత్తితో పొడిచిన అన్న
విశాఖపట్టణం జిల్లా చోడవరంలో భూమి తగాదా కారణంగా అన్నదమ్ములు గొడవపడ్డారు. సత్తిబాబు అనే వ్యక్తి తన తమ్ముడు బాబూరావును గురువారం ఉదయం కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాబూరావును చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చోడవరం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంటా.. వియ్యంకుడికి భయపడుతున్నారా?
-
గంటా.. వియ్యంకుడికి భయపడుతున్నారా?: రోజా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మహిళా వ్యతిరేక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. మహిళలపై దాడులు, ఆత్మహత్యలు కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. సోమవారం పార్టీ కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ నేరస్తులకు అండగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన ప్రిన్సిపాల్ బాబూరావును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె డిమాండ్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించి తక్షణమే బాబూరావుపై విచారణకు ఆదేశించాలన్నారు. రిషితేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదినకు ఆంధ్రప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టిందని రోజా ప్రశ్నించారు. నిజాలు బయటపడతాయని ప్రభుత్వం భయపడుతుందన్నారు. తమకు న్యాయం జరగలేదనే రిషితేశ్వరి తండ్రి... తన కుమార్తె మృతిపై సీబీఐతో విచారణ చేయించాలంటున్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు నారాయణ కాలేజీల్లో 11మంది విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపాలన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు...తన వియ్యంకుడు నారాయణకు భయపడే ఆ కళాశాలపై చర్యలు తీసుకోవటానికి వెనకాడుతున్నారన్నారు. నారాయణ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై విచారణ జరిపించి, తప్పులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, నారాయణ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు అంతా ఏకమై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను నిలదీసి పోరాడాలని రోజా పిలుపు నిచ్చారు. -
మరో రెండు సుందర గిరులు
వుడా చేతికి శీతకొండ, ఎర్రకొండ ఆ రెండింటిపై పర్యాటక హంగులు చిన్న పట్టణాల రోడ్లు విస్తరణ మీట్ ది ప్రెస్‌లో బాబూరావునాయుడు విశాఖపట్నం సిటీ : నగరంలోని శీతకొండ, ఎర్రకొండలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని వుడా వీసీ డాక్టర్ టి.బాబూరావు నాయుడు అన్నారు. వీజేఎఫ్ ఓ హోటల్లో గురువారం నిర్వహించిన మీట్‌ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ విదేశీ సహకారంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నగరాభివృద్ధికి మలేషియా, అమెరికా వంటి దేశాలు సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తున్నాయని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సమయాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయిస్తున్నట్టు వెల్లడించారు. వుడా చిల్డ్రన్స్ థియేటర్ పెండింగ్ పనులకు ఒకే టెండర్ దాఖలవడంతో ఆ కాంట్రాక్టు పనులు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని కొత్త టెండర్లు పిలుస్తున్నామని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగానే రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయో లేదో పరిశీలించే పనిని చేపట్టినట్టు ప్రకటించారు. కొన్ని చోట్ల చిన్నచిన్న తప్పిదాలున్నట్టు గమనించామన్నారు. అందుకే ఏ ప్రాంతంలో ఏ సర్వే నంబర్‌తో రోడ్లు వెళ్లాలనేది ప్రజలందరికీ తెలిసేలా త్వరలోనే ప్రకటనలు జారీ చేస్తామని ప్రకటించారు. ప్రజలు గమనించి అందుకు తగ్గట్టుగా ఆస్తులను కొనుగోలు చేసుకుంటారని చెప్పారు. వుడా కార్యాలయం ధనవంతులకే అన్న అపవాదు పోయేలా పేదలకు అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. త్వరలోనే పేదల కోసం మంచి ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు. భూసంబంధ అంశాలపై ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల నష్టపోతున్నారని గుర్తు చేశారు. విద్యా వంతులు సైతం లే అవుట్ల నిర్వాహకుల మాయలో పడి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని చెప్పారు. అందుకే ప్రజలంద రికీ ఎల్పీలపై అవగాహన కలిగేలా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. వుడా పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తుని వంటి పట్టణాల్లో నగర రోడ్లను త్వరలో విస్తరిస్తామని ప్రకటించారు. ఆయా పట్టణాల్లో ఇరుకు రోడ్లే ఇప్పటికీ ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్నాయని అందుకే మాస్టర్ ప్లాన్ మేరకు రోడ్లను విస్తరిస్తామని ప్రకటించారు. వుడాలో గతంలో జరిగిన కుంభకోణాలన్నీ న్యాయ పరిధిలో ఉన్నందున వాటిపై తనను ప్రశ్నించవద్దని విలేకరులకు సూచించారు. కార్యక్రమంలో వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావుతో పాటు కార్యవర్గం పాల్గొంది. -
ఉత్తరాల ద్వారా వేధింపులు.. బాధితుడి ఫిర్యాదు
చిలకలగూడ (హైదరాబాద్): ఉత్తరాల ద్వారా వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడకు చెందిన బాబురావు (45) వివాహితుడు. ఆయనకు భార్య, పిల్లలు కూడా ఉన్నారు. కొద్దిరోజులుగా ఆయన చిరునామాకు పోస్టుద్వారా ఉత్తరాలు వస్తున్నాయి. వాటిలో అసభ్యపదజాలంతో కూడిన దూషణలు, వేధింపులు ఉంటున్నాయి. దీంతో బాబురావు ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ వేధింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. -
సస్యరక్షణే కీలకం
సిరులు కురిపించే క్యాబేజీ జిల్లాలో విస్తారంగా సాగు మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు గిరిజనులకు సిరులు కురిపించే పంట క్యాబేజీ. దీనికి చల్లని వాతావారణం అనుకూలం. ఏజెన్సీతోపాటు మైదానంలో.. ఖరీఫ్, రబీ కాలాల్లో ఏటా సుమారు 15 వేల ఎకరాల్లో సాగువుతోంది. ఈ పంటకు ఎక్కువగా ఆశించే చీడపీడలను నెట్టుకు రాగలిగితే.. మంచి దిగుబడులతోపాటు ఆదాయానికీ ఆస్కారముంటుంది. హుకుంపేట, న్యూస్‌లైన్ : క్యాబేజీ పంట ఎంతగా లాభాలను తెచ్చిపెడుతుందో అంతగా చీడపీడలకు గురవుతుంది. దీనికి పెట్టుబడులు అంతగా అవసరం లేదు. ఏజెన్సీ రైతులు ఎలాంటి రసాయన ఎరువులూ వినియోగించకుండానే పూర్తిగా స్వాభావిక సాగుతోనే పండిస్తారు. అయినా దీనికి పురుగుల బెడద తప్పదు. ఈ పంటకు సస్యరక్షణే ప్రధానం. విత్తుకునే ముందు విత్తశుద్ధి తప్పనిసరి. కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడేతో విత్తనశుద్ధి చేసుకుంటే పంటకు రెక్కల పురుగు బెడదను నియంత్రించవచ్చు. ప్రధాన బెడద ఆకుపురుగు దీని ఆకు అడుగు భాగాన్ని తిని గడ్డను తొలిచి రంధ్రాలు చేసి అధికంగా నాశనం చేస్తుంది. ఈ పురుగులు ఆశించిన ఆకులు వాడిపోయినట్టు కనిపిస్తాయి. ఇవి అధికంగా ఉన్నప్పుడు ఆకులలో ఈనెలు మాత్రమే మిగులుతాయి. ఈ పురుగు నివారణకు 0.1 శాతం మలాథియాన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో 50 శాతం లేదా నీటిలో కరిగే డబ్ల్యూపీ కార్బరిల్‌ను 0.15 శాతం 3 మిల్లీ గ్రాముల మందును లీటరు నీటిలో చొప్పున కలిపి పిచికారీ చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. క్యాబేజీ తొలుచు పురుగు: వీటి పిల్ల పురుగు ఆకులను చుట్టుకునేట్లుగా చేయడం లేదా కాండం లోపల రంధ్రాలు చేసి తినడానికి ఉపయోగం లేకుండా చేస్తుం ది. ఇవి గడ్డను కూడా తొలిచి రంధ్రాలు చేస్తాయి. ఈ పురుగు నివారణకు 0.1 శాతం మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా 0.05 శాతం ఎండోసల్ఫాన్ లీటరు నీటిలో క లిపి పిచికారీ చేయాలి. ఆకునల్లి పురుగు: పిల్ల పురుగులు ఆకులు కొమ్మల నుంచి రసాన్ని పీల్చడం వల్ల వడిలినట్టు కనిపించడమేకాకుండా మొక్కలు బలహీనమవుతాయి. ఈ పురుగు నివారణకు 0.1 శాతం మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగు: ఇవి ఆకు అడుగు భాగంలో ఉండి ఆకులు ముడుచుకునేటట్లు చేసి పత్రహరితాన్ని తినేసి ఈనెను మాత్రం మిగుల్చుతాయి. ఈ పురుగులు పువ్వులను గడ్డలను కూడా ఆశిస్తాయి. వీటి నివారణకు 0.04 శాతం మోనోక్రోటోఫాస్1 మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి పైరు చల్లాలి. ఆకుపచ్చ దాసరి పురుగు : ఇది ఆకులకు రంధ్రాలు చేయడమే కాక ఆకులలో ఈనెలు మాత్రమే మిగిల్చి నాశనం చేస్తుంది. ఈ పురుగు నివారణకు 0.05 శాతం క్వినాల్ ఫాస్ 2 మిల్లీ లీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దెపురుగు : ఇవి రాత్రిపూట సంచరిస్తాయి. ఇవి ఆకులను, చిగుళ్లను తింటాయి. చిన్న లద్దె పు రుగులు ఆకుల్లోని ఆకుపచ్చని పదార్థం తినేసి ఈనెలను మాత్రం మిగులుస్తాయి. తదుపరి వె డల్పాటి ఆకులను పూర్తిగా తినేస్తాయి. ఈ పురుగు నివారణకు గడ్డ ఏర్పడే ముం దు 0.05 శాతం కార్బరిల్ 3 గ్రా ముల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మందులు అందుబాటులో లేవు నాది హుకుంపేట మండలం చీకటిపుట్టు. అర ఎకరా భూమిలో క్యాబేజీ పంట చేపట్టాను. ఏటా సులభంగా చీడపీడలకు గురవుతోంది. వాటికి పురుగు మందులు పిచికారీ చేసేందుకు మందులు అందుబాటులో లేకుండా పోయాయి. ఒడిశా, విజయనగరం వెళ్లి పురుగుమందులు తెచ్చుకోవడం వల్ల ఖర్చులు అధికం అవుతున్నాయి. -వంతాల రామన్న రైతు సకాలంలో స్పందించాలి సకాలంలో స్పందించి సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వస్తాయి. కష్టానికి తగ్గ ప్రతి ఫలం ఉంటుంది. చీడపీడల కారణంగా క్యాబేజీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక్కడి చల్లని వాతావరణం క్యాబేజీకి ఎంత అనుకూలమో, చలిగాలుల వల్ల తెగుళ్లు కూడా అదేవిధంగా వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఉంది. -చిట్టిబాబు, ఐటీడీఏ పీహెచ్‌వో, పాడేరు అధికారులు సహకరించాలి నాది హుకుంపేట మండలం బొడ్డాపుట్టు. ఎకరా భూమిలో పంటను చేపట్టాను. అధికారులు సహకారం లేకపోవడంతో ఏ తెగులుకు ఏ మందు పిచికారీ చేయాలో తెలియక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. గ్రామంలో సిబ్బంది పర్యటించి తగిన సకాలంలో తగిన సూచనలు సలహాలు అందిస్తే బాగుంటుంది. - పి. బాబురావు, రైతు -
నందిగామ కాంగ్రెస్ అభ్యర్థిగా బాబూరావు
ఎమ్మెల్యే మృతితో ఖాళీ అయిన నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. తంగిరాల ప్రభాకరరావు మృతి కారణంగా ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమెకు సానుభూతిగా వేరే పార్టీలేవీ పోటీ చేయకుండా ఉండాలని, ఏకగ్రీవంగా ఆమెను ఎన్నిక చేయాలని తెలుగుదేశం పార్టీ కోరింది. అయితే ఏపీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ అభ్యర్థిని నిలబెట్టాలనే నిర్ణయించుకుంది. గడిచిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క స్థానం కూడా దక్కని విషయం తెలిసిందే. ఈసారి నందిగామ స్థానంలో ఏపీసీసీ కార్యదర్శి బోడపాటి బాబూరావుతో పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పేరు ఖరారు చేశారు. -
తీరంలో కలవరం
నగరం, న్యూస్‌లైన్: గుర్తు తెలియని మృతదేహాలు తీరప్రాంత ప్రజల్ని కలవరపెడుతున్నాయి. 20 రోజుల వ్యవధిలోనే మూడు మృతదేహాలను గుర్తించడం కలకలం సృష్టించింది. అసలు ఈ మృతదేహాలు ఎవరివి..? ఈ ప్రాంతంలోనే హత్యకు గురయ్యారా... ఎక్కడో హత్యచేసి మృతదేహాలను ఈ ప్రాంతంలో పడవేస్తున్నారా..? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. మిస్టరీగా మారిన ఈ కేసుల ఛేదన పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. నగరం మండలం మీసాలవారిపాలెం సమీపంలో రేపల్లె-నిజాంపట్నం రహదారి కల్వర్టుపై ఈ నెల 10వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత పది రోజుల వ్యవధిలోనే మరో ఘటన వెలుగు చూసింది. ఇదే ప్రాంతంలోని పంట పొలాల్లో 21వ తేదీన గుర్తుతెలియని మరో మృతదేహం కంటపడింది. మృతదేహాన్ని ఆలస్యంగా గుర్తించడంతో సంఘటన స్థలంలో కేవలం ఎముకల గూడు మాత్రమే లభించింది. ఈ రెండు ఘటనలు ఎలా జరిగాయోనని పోలీసుల విచారణ చేస్తున్న తరుణంలోనే తాజాగా 28వ తేదీ ఆదివారం పెదమట్లపూడిలోని కొమరోలు పంట కాల్వ కట్టపై మరో మృతదేహం వెలుగుచూడడం గమనార్హం! మృతదేహాలను జన సంచారం లేని ప్రాంతాల్లో పడవేస్తున్నారంటే ఈ ఘటనలతో స్థానికులకు ఎవరికో సంబంధం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వరుస ఘటనలు తీర ప్రాంత ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మృతదేహం వెలికితీత.. పెదమట్లపూడి శివారు కొమరోలు పంటకాల్వ కట్టపై పూడ్చిపెట్టిన మృతదేహాన్ని ఆదివారం పోలీసులు వెలికితీశారు. తహశీల్దార్ సైకం జగన్మోహన్రావు పర్యవేక్షణలో పోలీసులు మృతదేహానికి శవసంచనామా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని తలపై బలమైన గాయం, గొంతుపై కత్తి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. తలపై బండరాయితో మోది చాకుతో పీక కోసి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన హత్యకు గురైన వ్యక్తి మృతదేహంపై కూడా ఇలాంటి గుర్తులే ఉండటంతో ఈ రెండు హత్యలకు పాల్పడింది ఒక్కరే అయి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం వెలికి తీసిన మృతదేహం చేతులు కట్టేసి ఉన్నాయని, ఎరుపు రంగు టీ షర్టు ధరించి ఉన్నట్లు స్థానిక ఎస్ఐ రామిశెట్టి ఉమేష్ తెలిపారు. మృతుడి వయస్సు 35 ఏళ్లు ఉంటుందని చెప్పారు. వీఆర్వో రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని ట్రైనీ డీఎస్పీ మహేష్, సీఐ సూర్యనారయణరెడ్డిలు పరిశీలించారు. కార్యక్రమంలో నిజాంపట్నం ఎస్ఐ బాబూరావు, ట్రైనీ ఎస్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.