నగరంపాలెం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ రాజ్యాంగ పదవిలో ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నందువల్ల.. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని జైభీమ్ కార్మిక సంక్షేమ సంఘం కూటమి అధ్యక్షుడు పిల్లి బాబురావు డిమాండ్ చేశారు. కలెక్టర్ బంగ్లారోడ్డులోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠికి గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆయన, కూటమి సభ్యులు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఎవరైనా హేళన చేస్తే వారి అంతు చూస్తానంటూ బలవంతపు హిందూ మతమార్పిడులను ప్రేరేపిస్తున్నారని, ఇది రాజకీయకుట్ర అని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ప్రధాని మోదీ కూడా ఉన్నారని, వారివురిపై దేశద్రోహం, రాజద్రోహం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయని, వాటిని విస్మరించి లడ్డూలపై తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. కూటమి సభ్యులు ఎన్.నీలాంబరం, కొండపల్లి విల్సన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment