ఎమ్మెల్యే మృతితో ఖాళీ అయిన నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.
ఎమ్మెల్యే మృతితో ఖాళీ అయిన నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. తంగిరాల ప్రభాకరరావు మృతి కారణంగా ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమెకు సానుభూతిగా వేరే పార్టీలేవీ పోటీ చేయకుండా ఉండాలని, ఏకగ్రీవంగా ఆమెను ఎన్నిక చేయాలని తెలుగుదేశం పార్టీ కోరింది.
అయితే ఏపీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ అభ్యర్థిని నిలబెట్టాలనే నిర్ణయించుకుంది. గడిచిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క స్థానం కూడా దక్కని విషయం తెలిసిందే. ఈసారి నందిగామ స్థానంలో ఏపీసీసీ కార్యదర్శి బోడపాటి బాబూరావుతో పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పేరు ఖరారు చేశారు.