
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : చింతపల్లి ఎంపీపీ వంతాల బాబూరావును పదవి నుంచి తొలగించాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఎన్నికల అథారిటీ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిషత్ ఎన్నికల సమయంలో ఎంపీపీ ఎన్నికల్లో 20 మంది ఎంపీటీసీల్లో 9 మంది ఇండిపెండెంట్లు బాబూరావును బలపర్చగా, మరో 9 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనూషదేవిని బలపర్చారు.
ఇద్దరికీ సమానంగా సభ్యుల మద్దతు రావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్రనాథ్ లాటరీ తీశారు. డ్రాలో బాబూరావుకు ఎంపీపీ పదవి వరించింది. ఎన్నికల నామినేషన్ దాఖలు సమయంలో బాబూరావు ఆయనపై ఉన్న కేసుల వివరాలను నమోదు చేయలేదని అనూషదేవి కోర్టును ఆశ్రయించడంతో పాడేరు సబ్ కలెక్టర్ విచారణ జరిపారు.
బాబూరావుపై కేసులు ఉన్నట్టు తేలడంతో పదవికి అనర్హుడిగా పేర్కొంటూ ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ కోరాబు అనూషదేవిని ఎంపీపీ పదవి వరించనుంది. (క్లిక్ చేయండి: విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..)
Comments
Please login to add a commentAdd a comment