
సాక్షి, చెన్నై: జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ ఫిలిం ఎడిటర్ కె బాబురావు అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళం, హిందీ భాషల చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. అందులో అనేక విజయవంతమైన చిత్రాలతో పాటు చక్కటి కథాంశంతో ప్రేక్షకులను అలరించిన చిత్రాలు అధికంగా ఉన్నాయి.
కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందించిన పలు చిత్రాలకు బాబురావు ఎడిటర్‌గా పనిచేశారు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం సాగింది. బాబురావు ఎడిటర్‌గా పనిచేసిన సిరిసిరిమువ్వ సినిమాకు గానూ ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. బాబురావు మృతి పట్ల దక్షిణాది ఇండస్ట్రీ సంతాపం తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment