మంత్రి గంటా శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా విద్యాకుసుమాలు రాలిపోతుండటం.. ఒత్తిడి తాళలేక పెద్దసంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుండటం రాష్ట్రంలో తీవ్ర ఆందోళన రేపుతోంది. విద్యా వికాసాన్ని పంచాల్సిన చదువులే.. యమపాశలై.. కార్పొరేట్ కళాశాలల ఒత్తిళ్లకు విద్యార్థులు బలి అవుతుండటం రాష్ట్రంలో తీరని విషాదాన్ని నింపింది. ఇటీవలికాలంలో నారాయణ కాలేజీలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం.. వారి తల్లిదండ్రుల గుండెల్లో తీరనిశోకాన్ని నింపింది.
అయితే, ఇంతటి తీవ్రమైన ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తేలికగా స్పందించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన మంత్రే.. కాలేజీల్లో ఆత్మహత్యలు ఓవర్‌నైట్‌లో ముగిసిపోవు అంటూ తేల్చేశారు. విద్యార్థులు చనిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని, విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు కమిటీ వేశామని ఆయన చెప్పుకొచ్చారు. నిబంధనలు ఎవరూ ఉల్లంఘించినా కాలేజీలను మూసివేస్తామని మంత్రి గంట అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment