Madhapur Narayana College Student Death Case Updates - Sakshi
Sakshi News home page

మాదాపూర్ నారాయణ కాలేజీ విద్యార్థి బలవన్మరణం

Published Fri, Aug 11 2023 6:38 PM | Last Updated on Fri, Aug 11 2023 8:28 PM

Madhapur Narayana College Student Death Case Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కార్పోరేట్‌ చదువులు మరో విద్యార్థిని బలిగొన్నాయి!. రాజేంద్రనగర్‌లో ఓ కార్పొరేట్‌ కళాశాల ఉదంతం మరువకముందే.. మాదాపూర్ నారాయణ కాలేజీలో సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి ఒకరు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన గదిలో ఫ్యాన్‌కి తాడుతో ఉరేసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. 

కనక రాజు అనే విద్యార్థి.. మాదాపూర్‌ నారాయణ కాలేజీలో ఇంటర్‌ బైపీసీ సెకండియర్‌ చదువుతున్నాడు. మధ్యాహ్న సమయంలో అటెండెన్స్‌ సమయంలో కనకరాజు లేకపోవడంతో.. సిబ్బంది అతని గదికి వెళ్లి చూశారు. అక్కడ విగతజీవిగా  ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు కనకరాజు. 

చదువులో బాగా రాణించేవాడని, ఫస్ట్‌ ఇయర్‌లో కూడా మంచి మార్కులు వచ్చాయని, అతనికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తమకు తెలియదని కళాశాల యాజమాన్యం చెబుతోంది. మరోవైపు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వాళ్లను ప్రశ్నిస్తే కనరాజుకి ఉన్న సమస్యేంటో బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement