జిన్నారం(పటాన్‌చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం శివారులోని నారా యణ కళాశాలలో విద్యార్థినులు వాంతులు, విరోచ నాలతో అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా రు. నారాయణ బాలికల కళాశాలలో సుమారు 500 మంది విద్యార్థినులు ఉన్నారు. నెలరోజుల నుంచి విద్యార్థినులు విరోచనాలు, వాంతులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఈ విషయాన్ని యాజ మాన్యం గుట్టుగా ఉంచటంతోపాటు రహస్యంగా విద్యార్థినులను ఇంటికి పంపిస్తోంది. వారంరోజు ల్లో 200 మంది విద్యార్థినులు ఆస్పత్రిపాలు కావ టంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భారీ సంఖ్యలో కళాశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. కలు షిత నీరు, ఆహారం వల్లే ఇబ్బందులు పడుతున్నా మని విద్యార్థినులు వాపోయారు.
ఇంటర్ మొదటి సంవత్సరానికి చెందిన ఓ విద్యార్థిని తండ్రి వెంక టేశ్‌యాదవ్ మాట్లాడుతూ ఈ ఏడాది మూడుసార్లు ఇలాగే జరిగిందని, ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదన్నారు. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నదే తప్ప విద్యార్థుల ఆరోగ్యంపై యాజమాన్యం దృష్టి సారించటంలేదని విమర్శించారు. సంక్రాంతి పండుగ పేరిట విద్యార్థినులకు పది రోజులపాటు యాజమాన్యం సెలవులు ప్రకటించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment