సాక్షి, హైదరాబాద్: రామంతాపూర్ నారాయణ కాలేజీలో గాయపడిన విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. అయితే యశోద ఆసుప్రతిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు. సందీప్ సహా వెంకటేష్‌చారీ, కాలేజ్ ఏవో అశోక్‌కు డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మరోవైపు హైదరాబాద్ నారాయణ కాలేజీకి తెలంగాణ ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసింది. రామాంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
టైం టు టైం ఏం జరిగిందంటే
► 12:20కి కాలేజ్ వచ్చిన సాయి నారాయణ అతని స్నేహితుడు సందీప్‌తో పాటు మరో ఆరుగురు
►12:35 ప్రిన్సిపాల్ ఛాంబర్‌లోకి వెళ్లిన సాయి నారాయణ స్నేహితులు
►12:40కి ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో సర్టిఫికెట్ విషయంలో వాగ్వివాదం
►12:43కి పెట్రోల్ పోసుకున్న సందీప్ అనే విద్యార్థి సంఘం నాయకుడు
►12:43కి ప్రిన్సిపాల్ రూమ్‌లో మంటలు రావడంతో ఛాంబర్‌లోకి పరుగెత్తిన ఏఓ అశోక్
►12:44 కి ప్రిన్సిపాల్ రూమ్‌లో నుంచి పరుగు ఎత్తడం తో ఏఓ అశోక్ ను పట్టుకున్న సందీప్
►12:45కి గాయాలతో బయటకు వచ్చిన సందీప్, అశోక్
►12:45 కి మంటలు ఆర్పిన సిబ్బంది
►12:50కి విద్యార్థి నాయకుడు సందీప్, అశోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు
► 1:20కి గాంధీ ఆస్పత్రికి చేరుకున్న బాధితులు. అక్కడి నుంచి యశోద, డీఆర్‌డీఓ ఆసుపత్రికి బాధితులను తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment