Student union leaders
-
లోకేష్, చంద్రబాబుకు విద్యార్థి సంఘాలు హెచ్చరిక
-
పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయావా ?
-
హైదరాబాద్: నీట్ పరీక్షలో అవకతవకలపై విద్యార్థి సంఘాల ర్యాలీ
-
మాజీ మంత్రి చాంబర్ నుంచి ఫర్నిచర్ తరలింపు!
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రవీంద్రభారతిలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చాంబర్ నుంచి కొందరు ఫర్నిచర్‌ను తీసుకువెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం కొంతమంది వ్యక్తులు ఫర్నిచర్‌ను తీసుకువెళుతుండగా ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తులకు, ఓయూ జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. #OU student union leaders stopped the shifting of furniture from Former Minister Srinivas Goud's office, alleging that public property is being moved illegally. pic.twitter.com/cHlqXF4zgb — Sudhakar Udumula (@sudhakarudumula) December 6, 2023 ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్‌ను ఎలా తీసుకువెళతారని జేఏసీ నాయకులు వారిని ప్రశ్నించారు. దీంతో వారు ఫర్నిచర్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనపై టీజీఓ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, తమ కార్యాలయంలో వినియోగించుకునేందుకు ఆ ఫర్నిచర్‌ను తీసుకువెళ్లాలనుకున్నామని, అయితే అది ప్రభుత్వానిదని తెలియడంతో ఆ ప్రయత్నం మానుకున్నామని తెలిపారు. -
కాలేజీ భవనం నుంచి దూకిన విద్యార్థిని
అనంతపురం (శ్రీకంఠం సర్కిల్): అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న భవ్యశ్రీ సోమవారం మధ్యాహ్నం కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. వన్‌టౌన్ సీఐ రవిశంకరరెడ్డి కథనం ప్రకారం.. కదిరి పట్టణానికి చెందిన జ్యోతి, సాంబశివుడు దంపతుల కుమార్తె భవ్యశ్రీ అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉండటంతో భవ్యశ్రీ స్థానిక అంబార్ వీధిలో అమ్మమ్మ వద్ద ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తోంది. ఒంటరినైపోయానన్న ఆవేదన కొద్దిరోజులుగా భవ్యశ్రీలో నాటుకుపోయింది. మరోవైపు ఫీజుల విషయమై కళాశాల యాజ మాన్యం భవ్యశ్రీని మందలించినట్లు తెలిసింది. ఫీజు డబ్బు మొత్తం కడితేనే రికార్డులు ఇస్తామని బెదిరించింది. ఈ నేపథ్యంలో ఉదయాన్నే ఆ విద్యార్థిని కళాశాల భవనంపైకి చేరుకుంది. మధ్యాహ్నం వరకు ఆమెను ఎవరూ గుర్తించలేదు. మధ్యాహ్నం 12.30 గంటలకు భవనంపై నుంచి కిందకు దూకింది. అది చూసిన విద్యార్థులు హుటాహుటిన 108 వాహనంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాలకు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘం నేత ఆకుల రాఘవేంద్రతో పాటు పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
జైపూర్: వివిధ సంస్థల్లో యూనియన్లు ఏర్పాటు చేసి దానికి లీడర్లను ఎన్నుకోవడం సాధారణ విషయమే, విద్యాసంస్థల్లోనూ ఈ విధానం అమలవుతోంది. కాలేజీ, యూనివర్సిటీలోనూ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఉంటాయి. అక్కడ కూడా స్టూడెంట్స్ తమలో ఒకరిని విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేసే విద్యార్థి నాయకులంతా ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల హామీలు, వాగ్దానాలు చేస్తుంటారు. ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు తనను ఎన్నుకుంటే చేసే అభివృద్ధిని వివరిస్తూ వరాల జల్లు కురిపిస్తారు. అచ్చం ఇలాగే ఓ కాలేజీలో లీడర్‌గా పోటీ చేస్తున్న కొందరు విద్యార్థి నాయకులు ఓట్ల కోసం వినూత్నంగా వేడుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బరన్ జిల్లాలోని ఓ కళాళాలలో విద్యార్థి సంఘాల నేతలు ఓటు వేయడానికి వస్తున్న ప్రతి స్టూడెంట్స్‌ను అడ్డుకొని నమస్కరించి, కాళ్లు పట్టుకొని, తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యంగా అమ్మాయిలు కనిపిస్తే వారి కాళ్లపై పడి పాదాలు పట్టుకొని తనకు అనుకూలంగా ఓట్లు వేయాలని ప్రాధేయపడ్డారు. చదవండి: అదరగొట్టిన ఆఫ్రికన్ చిన్నారులు.. కేటీఆర్ మెచ్చిన డ్యాన్స్ వీడియో ఓటు వేస్తామని విద్యార్థులు భరోసా ఇచ్చేంత వరకు తమ కాళ్లను వదిలిపెట్టకుండా పట్టేసుకున్నారు. దీంతో కాళ్లు పట్టుకొని ఓట్లు అడుగుతున్న వారిని చూసి అక్కడున్న వారంతా ఆశ్యర్యపోయారు. ఈ వీడియోను అన్‌సీన్ ఇండియా అనే పేజీ ట్విట్టర్లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రెండేళ్ల విరామం తర్వాత శుక్రవారం రాజస్థాన్‌లో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. శనివారం ఉదయం ఓట్ల లెక్కించి, మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని राजस्थान विश्वविद्यालय छात्र संघ चुनाव के दौरान प्रत्याशियों ने सड़क पर लेटकर पैर पकड़कर माँगे वोट. pic.twitter.com/rmvlgCFXgJ — UnSeen India (@USIndia_) August 26, 2022 -
ప్రిన్సిపాల్ రూమ్‌లో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
ప్రిన్సిపాల్ గదిలో జరిగింది ఇదే.. క్లారిటీ ఇచ్చిన ఈస్ట్ జోన్ డీసీపీ
-
రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: రామంతాపూర్ నారాయణ కాలేజీలో గాయపడిన విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. అయితే యశోద ఆసుప్రతిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. సందీప్ సహా వెంకటేష్‌చారీ, కాలేజ్ ఏవో అశోక్‌కు డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు హైదరాబాద్ నారాయణ కాలేజీకి తెలంగాణ ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసింది. రామాంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. టైం టు టైం ఏం జరిగిందంటే ► 12:20కి కాలేజ్ వచ్చిన సాయి నారాయణ అతని స్నేహితుడు సందీప్‌తో పాటు మరో ఆరుగురు ►12:35 ప్రిన్సిపాల్ ఛాంబర్లోకి వెళ్లిన సాయి నారాయణ స్నేహితులు ►12:40కి ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో సర్టిఫికెట్ విషయంలో వాగ్వివాదం ►12:43కి పెట్రోల్ పోసుకున్న సందీప్ అనే విద్యార్థి సంఘం నాయకుడు ►12:43కి ప్రిన్సిపాల్ రూమ్‌లో మంటలు రావడంతో ఛాంబర్లోకి పరుగెత్తిన ఏఓ అశోక్ ►12:44 కి ప్రిన్సిపాల్ రూమ్‌లో నుంచి పరుగు ఎత్తడం తో ఏఓ అశోక్ ను పట్టుకున్న సందీప్ ►12:45కి గాయాలతో బయటకు వచ్చిన సందీప్, అశోక్ ►12:45 కి మంటలు ఆర్పిన సిబ్బంది ►12:50కి విద్యార్థి నాయకుడు సందీప్, అశోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు ► 1:20కి గాంధీ ఆస్పత్రికి చేరుకున్న బాధితులు. అక్కడి నుంచి యశోద, డీఆర్డీఓ ఆసుపత్రికి బాధితులను తరలించి చికిత్స అందిస్తున్నారు. -
‘ఫీజు విషయంలోనే వివాదం.. ప్రిన్సిపాల్ వెనక్కి తగ్గకపోవడంతో’..
సాక్షి,హైదరాబాద్: రామాంతాపూర్ నారాయణ కాలేజీలో జరిగిన ఘటనపై అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. విద్యార్థి నాయకుడు సందీప్ పెట్రోల్ బాటిల్‌తో కాలేజీకి వచ్చినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌పై పోసేందుకే పెట్రోల్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. సాయి ఫీజు, టీసీ విషయంలో నారాయణ అనే విద్యార్థికి ప్రిన్సిపాల్‌తో వివాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నామన్నారు. ‘విద్యార్థి సాయి నారాయణ ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నాడు. సాయి తన తండ్రి, విద్యార్థి సంఘం నాయకుడు సందీప్‌తో కలిసి కాలేజ్‌కు వచ్చాడు. టీసీ ఇవ్వాలంటే డ్యూ ఉన్న రూ. 16 వేల ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ సుధాకర్ చెప్పాడు. ఈ క్రమంలో విద్యార్థి నేత నారాయణ , ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థి నేత సందీప్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సందీప్ వెనకాల దీపం ఉండటంతో క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. సందీప్‌ను అడ్డుకునే క్రమంలో ఏవో అశోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్‌కు గాయాలయ్యాయి. కాలేజీ సిబ్బందికి కూడా మంటలు అంటుకున్నాయి. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి నుంచి ఇద్దరిని యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది’ అని అడిషనల్ డీసీపీ తెలిపారు. చదవండి: నారాయణ కాలేజీ వద్ద టెన్షన్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం -
అనుమానితుల్లో ఆయిషీ!
న్యూఢిల్లీ/చెన్నై/భోపాల్: ఈ నెల 5వ తేదీ రాత్రి జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలకు బాధ్యుల్లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ ఘటనకు కారకులుగా భావిస్తున్న 9 మంది ఫొటోలను శుక్రవారం పోలీసులు విడుదల చేశారు. ‘మొత్తం 9 మందిలో ఏడుగురు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వారు కాగా, ఇద్దరు ఇతర సంఘాల వారు. వీరిలో వర్సిటీ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్ ఉన్నట్లు అనుమానిస్తున్నాం. అగంతకులంతా ముసుగులు ధరించి ఉండటంతో గుర్తింపు కష్టంగా మారింది’ అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డీసీపీ జోయ్ టిర్కే తెలిపారు. వర్సిటీలో వింటర్ సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ఫీజు జనవరి 1 నుంచి 5వ తేదీ ఉండాలని ఎక్కువ మంది విద్యార్థులు కోరుతుండగా వామపక్ష విద్యార్థి సంఘాలు అభ్యంతరం తెలపడం దాడులకు దారితీసిందన్నారు. వర్సిటీలోని పెరియార్ హాస్టల్లోని కొన్ని గదుల్లో మాత్రమే దాడులు చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, కానీ త్వరలోనే వారికి నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు ప్రతినిధి ఎంఎస్ రణ్‌ధవా చెప్పారు. సీసీటీవీ ఉంటే నిందితులను గుర్తించడం సులువుగా ఉండేదని, కానీ దురదృష్టవశాత్తు దాడికి ముందు రోజే సర్వర్ రూమును «ధ్వంసం చేశారని ఆయన చెప్పారు. వైఫై డిసేబుల్ చేయడం వల్ల సీసీటీవీ పుటేజీ లభించలేదని చెప్పారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, స్క్రీన్ షాట్ల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. కాగా, తనపై పోలీసులు చేసిన ఆరోపణలను ఘోష్ ఖండించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను బహిర్గతం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, తన ఫిర్యాదును ఎఫ్ఐఆర్గా నమోదు చేయలేదని ఆమె ఆరోపించారు. ఇలా ఉండగా ఈ దాడి ఘటనకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలను భద్రపరిచేలా ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జేఎన్యూకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ఢిల్లీ హైకోర్టులో పిల్(ప్రజాహిత వ్యాజ్యం) వేశారు. హింసాత్మక ఘటనకు కీలక ఆధారాలైన సీసీ టీవీ ఫుటేజీని కూడా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు సేకరించలేదని వారు అందులో తెలిపారు. ఈ పిల్‌పై 13వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ సేథి తెలిపారు. హెచ్చార్డీ నిర్ణయాలు యథాతథం: వీసీ జేఎన్‌యూ హాస్టల్ ఫీజులకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్చార్డీ) శాఖ గతంలో తీసుకున్న నిర్ణయాలను తుచతప్పకుండా అమలు చేస్తామని వీసీ ఎం.జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు. వర్సిటీలో 13వ తేదీ నుంచి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. జేఎన్‌యూ పరిపాలన విభాగం, వీసీతో హెచ్చార్డీ అధికారుల భేటీ అనంతరం వీసీ ఈ విషయాలను వెల్లడించారు. అవసరమనుకుంటే సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఖరి గడువును పొడిగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దేశ విచ్ఛిన్నకారులకు దీపిక మద్దతు బాలీవుడ్ నటి దీపికా పదుకొణే జేఎన్‌యూ సందర్శనపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. దీపిక దేశ విచ్ఛిన్నాన్ని కోరుకునే వారికి మద్దతుగా నిలిచారని వ్యాఖ్యానించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోతే పండగ చేసుకునే వారి పక్కన ఆమె నిలబడ్డారని, ఇది చూసి ఆమెను అభిమానించే వారంతా షాక్‌కు గురయ్యారన్నారు. ప్రధాని పదవికి రాహుల్ గాంధీయే సరైన వ్యక్తి అంటూ పదుకొనే 2011లో ప్రకటించి, తన రాజకీయ అనుబంధాన్ని చాటుకున్నారన్నారు. ‘అక్కడి వారు లాఠీలతో విద్యార్థినులను అభ్యంతరకరమైన రీతిలో కొట్టారు. అలాంటి వారి పక్కన దీపిక నిలబడింది. అది ఆమె హక్కు. ఇతర యువతులపై దాడికి చేసే వారికి కూడా ఆమె మద్దతు తెలుపుతుంది. ఆమెకు ఆ స్వాతంత్య్రం ఉంది. కాంగ్రెస్ పార్టీతో ఆమెకు సంబంధం ఉన్నట్లు 2011లోనే వెల్లడైంది’ అని పేర్కొన్నారు. చెన్నైలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఇరానీ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఆ పత్రిక ట్విట్టర్లో ఉంచింది. -
విద్యార్థి నాయకుడు కాల్చివేత
వారణాసిలోవిద్యార్థి నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయ్‌ప్రతాప్ కాలేజీలోని విద్యార్థి నాయకుడు వివేక్ సింగ్( 22) ను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. క్యాంపస్‌లోని హాస్టల్‌ముందు ఆదివారం రాత్రి ఈ ఘటన జరింది. ఈ నేపథ్యంలో కాలేజీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లా మేజిస్ట్రేట్ సురేంద్ర సింగ్ కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను శాంతింప జేసేందుకు ప్రయత్నించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటను జరగకుండా పోలీసులు బలగాలను మోహరించారు. అజాంగఢ్ జిల్లాలోని జముండేహ్ గ్రామంలోని బి.కాం రెండవ సంవత్సరం విద్యార్ధిగా వివేక్ సింగ్‌ను పోలీసులు గుర్తించారు. .32 బోర్ పిస్తోల్‌తో నిమిది సార్లు కాల్పులు జరిపారని పోలీసు అధికారి ఆనంద్ కులకర్ణి వెల్లడించారు. రక్తపు మడుగులో కొట్టిమిట్టాడుతున్న అతణ్ని సహచర విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా, అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారన్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సహా పోలీసుల ఏడు బృందాలు హంతకులను గుర్తించే పనిలో పడ్డాయని అధికారి తెలిపారు. -
శాతవాహనలో నిర్లక్ష్యపు ‘పరీక్ష’
శాతవాహన యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీలో సోమవారం జరిగిన తెలుగు పరీక్షలో 50 శాతానికి పైగా మార్కులకు సంబంధించిన ప్రశ్నలు సిలబస్‌లో లేనివి వచ్చాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు జనవరి 2న ప్రారంభమయ్యాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం గ్రూపుల్లో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు సోమవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉండగా దాదాపు 46 మార్కులకు సిలబస్‌లో లేని ప్రశ్నలే ఉన్నాయి. పరీక్ష కేంద్రాల్లోని సిబ్బందికి సమాచారమివ్వగా వారు వర్సిటీ అధికారులకు వివరించారు. తప్పిదాన్ని గుర్తించిన అధికారులు విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు. సిలబస్‌లో లేని ప్రశ్నలకు పూర్తి మార్కులు కలపాలని విద్యార్థులు కోరుతున్నారు. పదే పదే తప్పులు.. వర్సిటీ ప్రారంభం నుంచి పరీక్షల నిర్వహణలో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. పరీక్షల విభాగం పటిష్టంగా లేకపోవడమే ప్రధాన కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నాపత్రం తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తప్పులు దొర్లాయని అధికారులు చెబుతున్నారు. గతంలో డిగ్రీ ఫైనలియర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇంగ్లిష్ మీడియం ప్రశ్నపత్రం ముద్రణనే మరిచారు. సీబీసీఎస్(చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) పద్ధతిలో జరిగిన ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ పరీక్షలో 40 మార్కులకు ప్రశ్నపత్రంలో 2 గంటలకు బదులు 3 గంటలని ముద్రించారు. బీకాం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 80 మార్కులు, ప్రాక్టికల్ 20 మార్కులుంటాయని సిలబస్‌లో నిర్ణయించారు. కానీ, ప్రశ్నాపత్రం 60మార్కులకే ఇచ్చారు. మార్కులు, మోమోల విషయంలోనూ పలుమార్లు తప్పులు దొర్లడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డ సందర్భాలు అనేకం. న్యాయం చేస్తాం.. డిగ్రీ మొదటి సెమిస్టర్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో కొన్ని సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నపత్రం తయారీలో పొరపాటుతో ఇలా జరిగింది. వీసీ అనుమతి తీసుకొని విద్యార్థులు నష్టపోకుండా న్యాయం చేస్తాం. – వి.రమేశ్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ -
నిరుద్యోగికి నిరాశే
సాక్షి, అమరావతి: పట్టా చేతికొచ్చినా ప్రయోజనంలేదు. ఇంట్లో వాళ్లకి భారం కాకుండా ఏమి చేయాలో తెలియదు. ఉద్యోగం కోసం ఎటు పోవాలో అర్థంకాదు. వయసు పెరిగిపోతోందని బాధ ఓ వైపు. ఉద్యోగం వస్తుందో రాదో అనే ఆవేదన మరో వైపు. ఈ పరిస్థితులతో రాష్ట్రంలో నిరుద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వ నేతల హామీలు నీటి మూటలుగా మిగిలిపోవడంతో రాష్ట్రంలో ఏటేటా లక్షల సంఖ్యలో పెరిగిపోతున్న నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. బాబొస్తే జాబొస్తుందని చెప్పిన పాలకులు ఇంతవరకూ ఖాళీగా ఉన్న పోస్టులనే భర్తీ చేయకపోగా.. ఉన్న ఉద్యోగాలనే తొలగిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు మాటలు నమ్మిన వారు ఇప్పటి వరకూ తమకు రావాల్సిన రూ. 82 వేల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగిపోయింది. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం అప్పట్లో కమలనాథన్ కమిటీకి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. 2014 తరువాత రిటైరయిన వారితో కలుపుకుంటే ఆ పోస్టుల సంఖ్య ఇపుడు 1.80 లక్షలకు పైగా చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీచేయడం లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తోంది. వేలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పొట్టగొట్టింది. మరోపక్క ఏళ్లుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులకు వయోపరిమితి దాటిపోయింది. మరోపక్క ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో లక్షలాది మంది వేలాది రూపాయల ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు పదివేల పోస్టులను కూడా భర్తీచేయలేదు. 1.80 లక్షల ఖాళీల్లోనూ కేవలం 20 వేల ఖాళీలు మాత్రమే నింపుతామని, తక్కిన వాటిలో కొన్నింటిని ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ 20 వేలలోనూ కేవలం 10 వేలకు మాత్రమే ఏడాది క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా ఇప్పటివరకు వాటి నియామకాలు పూర్తికాలేదు. నాలుగు, ఐదేళ్ల నుంచి చూస్తే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 35 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. గతంలో ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు రాని వారిని కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వీరంతా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగం రాదని, ఉన్నత విద్య ఎందుకని రాష్ట్రంలో ఏటా 10వ తరగతి 5 లక్షల మంది, ఇంటర్మీడియెట్ 4 లక్షల మంది, డిగ్రీ 1.80 లక్షల మంది, సాంకేతిక, వృత్తి విద్యాకోర్సుల్లో 1.50 లక్షల మంది, పీజీ కోర్సుల్లో లక్ష మందికి పైగా పూర్తి చేస్తున్నారు. వీరిలో లక్షలాది మంది ఉన్నత విద్యకు వెళ్లడంలేదు. ఉద్యోగం రాదనే ఉద్దేశంతో వారు మధ్యలోనే చదువు విరమించుకుంటున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించే ప్రత్యేక హోదా హామీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడటంతో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపనకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇటు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, అటు ప్రైవేట్ ఉద్యోగాలు రాక ఉద్యోగం అనే మాటనే నిరుద్యోగులు మర్చిపోతున్నారు. రూ. 82 వేలు బకాయి ఎప్పుడిస్తారో? ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నేతలు తమ ప్రచారంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని నమ్మబలికారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులందరికీ ప్రతినెల రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 41 నెలలు అయినా ప్రభుత్వం నిరుద్యోగ భృతి గురించి పట్టించుకోలేదు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ నిరుద్యోగులకు బాసటగా పోరాటం చేసినా ఇన్నాళ్లూ పట్టించుకోని ప్రభుత్వం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాత్రం నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగభృతి కల్పించే ముసాయిదా ప్రతిపాదనను వెంటనే తయారు చేయాలని శుక్రవారం మంత్రివర్గం ఆదేశించినట్లు తెలిసింది. అయితే 41 నెలలుగా ప్రభుత్వం భృతి ఇవ్వాల్సి ఉందని, ఒక్కొక్కరికీ రూ. 82 వేలు చొప్పున బకాయి పడిందని నిరుద్యోగులు చెబుతున్నారు. అయితే భృతిపై నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలను ప్రభుత్వ వమ్ము చేయనుంది. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు చూస్తే అది స్పష్టమవుతుంది. రుణమాఫీ హామీ మాదిరిగానే నిరుద్యోగ భృతి హామీని కూడా మమ అనిపించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిరుద్యోగ భృతికి సవాలక్ష షరతులు నిరుద్యోగ భృతికి మంత్రుల కమిటీ పలు షరతులు పెట్టింది. రూ. 2 వేలు భృతి అని హామీ ఇచ్చి దాన్ని రూ. 1,500కు కుదిస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్యను కూడా భారీగా తగ్గించేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 35 లక్షలకు పైగా నిరుద్యోగులుండగా ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను 7 నుంచి 8 లక్షలకు తగ్గించాలని చూస్తోంది. 18 నుంచి 35 సంవత్సరాల వారు మాత్రమే భృతికి అర్హులను చేస్తోంది. ఇంటర్మీడియెట్‌ను కనీస అర్హతగా పరిగణిస్తున్నారు. ఇక భృతికి నైపుణ్య శిక్షణతో ముడిపెట్టారు. నిరుద్యోగ భృతి లేదా నైపుణ్యశిక్షణలో ఏదో ఒకదాన్ని అర్హులైన నిరుద్యోగులు ఎంచుకోవలసి ఉంటుంది. ప్రతి నిరుద్యోగికీ భృతి ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు మాత్రం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించారు. నాలుగు చక్రాల వాహనం ఉంటే ఇవ్వరాదని నిబంధనల్లో చేర్చారు. తెల్లకార్డు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకే దీన్ని పరిమితం చేయనున్నారు. అలాగే వ్యవసాయ భూమి మెట్ట అయిదెకరాలు, పల్లం 2.5 ఎకరాల లోపు ఉన్న వారికే భృతి వర్తిస్తుంది. గతంలో స్వయం ఉపాధి కింద రుణాలు పొందినా, శిక్షణ తీసుకున్నా వారినీ దీని నుంచి మినహాయించనున్నారు. ఉన్నత చదువులు చదివే వారిని భృతి నుంచి మినహాయిస్తారు. ఇక నిరుద్యోగ భృతి తీసుకుంటున్న వారికి గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతను అప్పగిస్తారు. పథకం ప్రారంభించడానికి ముందు... ఇప్పటి వరకు ఎక్కడా నిరుద్యోగులుగా పేరు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం ఇస్తారు. బేషరతుగా భృతి ఇవ్వాలి నిరుద్యోగ భృతిపై నాలుగేళ్లు నాన్చిన ప్రభుత్వ ఇపుడు షరతులతో కొద్దిమందికే భృతిని పరిమితి చేయాలనుకోవడం సరికాదు. చిన్న చిన్న ఐటీ కంపెనీలకే కోట్లాది రూపాయల రాయితీలను మంత్రి లోకేశ్ ప్రకటించారు. కానీ నిరుద్యోగులకు భృతి ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉద్యోగ ఖాళీలు ఉన్నా భర్తీ చేయడంలేదు. ఉద్గోగాలు వస్తాయని గత నాలుగు సంవత్సరాలుగా శిక్షణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ పరిస్థితుల్లో అందరికీ బేషరుతుగా భృతి చెల్లించాలి. – నూర్ మహమ్మద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల ముందు భృతి ప్రకటిస్తారా? గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చే ముందు ఇస్తామని ప్రకటించడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. కేవలం ఎన్నికల దృష్టితో ఈ ప్రకటన చేస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఆదుకునేందుకు మాత్రం కాదు. బేషరుతుగా నిరుద్యోగులందరికీ భృతి ఇవ్వాలి. వయో పరిమితి దాటిన అభ్యర్థులకూ భృతి కల్పించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.80 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. – సలాంబాబు, వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు -
విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
వైఎస్సార్ విద్యార్థి విభాగం డిమాండ్ అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్కేయూలో విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ఎస్కేయూ విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించాలని, మరోవైపు అధిక మెస్ బిల్లులు వస్తుండడంపై వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సెంట్రల్ ఆఫీస్ స్టోర్ వద్ద ధర్నా చేస్తే విద్యార్థి సంఘం నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. యూనివర్సిటీలో వీసీ పాలన కాకుండా పోలీసు పాలన జరుగుతోందన్నారు. సమస్యలపై ఏ చిన్న ధర్నా చేసినా పోలీసులకు ఫిర్యాదు చేసి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా అక్రమ కేసులు, అక్రమ దాడులు చేస్తే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు సుధీర్‌రెడ్డి, బాబాసలాం, నగర కార్యదర్శులు పూర్ణచంద్ర, సురేష్ పాల్గొన్నారు. -
కోదండరాం ఉద్యోగ విరమణ
ఘనంగా సత్కరించిన సికింద్రాబాద్ పీజీ కళాశాల విద్యార్థులు సాక్షి, హైదరాబాద్ : ప్రొఫెసర్ కోదండరాం బుధవారం పదవీ విరమణ చేశారు. 34 ఏళ్లపాటు విద్యార్థులు, తరగతి గదితో ఆయనకు ఉన్న బంధానికి తెరపడింది. 1981లో లెక్చరర్‌గా మొదలైన ఆయన ప్రస్థానం... ప్రొఫెసర్‌గా ముగిసింది. పౌర హక్కుల నేతగా, ప్రొఫెసర్‌గా, తెలంగాణ ఉద్యమంలో దిశానిర్దేశకులుగా.. ఆయన పోషించిన పాత్ర ఉన్నతమైనది. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌గా ఆయన కోట్లాది గుండెల్లో ఉద్యమ జ్వాలను రగిల్చారు. నిన్నటి వరకు సికింద్రాబాద్ పీజీ కాలేజ్‌లో బోధించిన ఆయన.. ఇకపై ప్రజల్లో తిరగనున్నారు. బుధవారం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగం అధ్వర్యంలో కోదండరాం ఆత్మీయ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పూలు జల్లుతూ కోదండరాంను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం తదితర సమస్యలపై దృష్టి సారించేందుకు తనకు పూర్తి సమయం లభించిందని.. సంపూర్ణ తెలంగాణ సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. 34 సంవత్సరాల ప్రొఫెసర్ పదవి తనకు పూర్తిగా సంతృప్తినిచ్చిందని పద వీ విరమణ పొందడం బాధాకరంగా ఉందని అన్నారు. అనంతరం కళాశాల ప్రొఫెసర్లు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కొదండరాంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లాలయ్య. కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదానే లక్ష్యం
విద్యార్థి సంఘ నాయకులు ఏఎన్‌యూ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమని దానికోసం జరిగే పోరాటంలో తామెప్పుడూ భాగస్వాములమవుతామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈనెల 26వ తేదీనుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరులో చేపడుతున్న నిరాహారదీక్షకు విద్యార్థులను సమాయత్తం చేసేందుకు మంగళవారం యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పాస్ట్రల్ సెంటర్ ప్రాంగణంలో సమావేశం జరిగింది. హోదా రాకపోతే గాఢాంధకారమే... సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎం.రాజన్న మాట్లాడుతూ ప్రత్యేక హో దా లేకపోతే విద్యార్థుల జీవితాలు అంధకారమవుతాయన్నారు. ఇప్పటికే రెండేళ్లుగా ఉద్యోగాలు లేక యువతీ యువకులు తీవ్ర నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకుడు పవన్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా సాధన పోరాటానికి ఎస్ఎఫ్ఐ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. ఓసీఎస్ఎఫ్ నాయకులు వెంకటరెడ్డి మా ట్లాడుతూ నవ్యాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు వైఎస్సార్సీపీ ముందుండి పోరాటం చేయటం మంచి పరిణామమన్నారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎస్ఎఫ్) నాయకుడు రాజేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు తమ సంఘం పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. మద్దతు ఇవ్వడం మనందరి బాధ్యత ఎస్టీఎస్ఎఫ్ నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల మేలుకోరి జగన్మోహన్రెడ్డి దీక్ష చేస్తున్నారని దానికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత తమందరిపై ఉందన్నారు. బీసీ విద్యార్థి సంఘ నాయకుడు గంగాధర్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయని దాని ద్వారా పరిశ్రమలు వచ్చి అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ విద్యార్థులందరూ ఏకతాటిపై ఉండి జగన్దీక్షను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్డీఎస్ఎఫ్ నాయకుడు గోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ గుం టూరు జిల్లా ప్రధానకార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, గుంటూరు నగర సేవాదళ్ అధ్యక్షులు కొండారెడ్డి, రూరల్ మండల కన్వీనర్ రాజు, పార్టీ నాయకులు గులాం రసూల్, బ్రహ్మారెడ్డి, ప్రవీణ్‌రెడ్డి,కర్ణుమా తదితరులు పాల్గొన్నారు. ఏఎన్‌యూ సమస్యలపై జగన్ నేతృత్వంలో పోరాటం ఏఎన్‌యూలో విద్యార్థి సంఘాలపై ఉన్న ఆంక్షలు, విద్యార్థులను అధికారులు పెడుతున్న ఇబ్బందులపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పోరాటం చేస్తామని లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఈ స్థాయికి ఎదగటానికి వాళ్ళు ఒకప్పుడు యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల్లో పనిచేయటమే కారణమనే విషయం మరిచారన్నారు.విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్మోహన్రెడ్డి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారన్నారు. పరిస్థితులను వివరించేందుకు ఏఎన్‌యూ విద్యార్థులను గుంటూరులో జగన్మోహన్ రెడ్డితో సమావేశపరుస్తామని చెప్పారు. -
‘నారాయణ’పై గరం గరం
జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఒంగోలు టౌన్ : నారాయణ విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర మంత్రి పి.నారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు. గడిచిన 15 నెలల్లో నారాయణ కళాశాలల్లో 11 మంది విద్యార్థులు మృతి చెందినా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాలల బంద్ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ మీదుగా నారాయణ దిష్టిబొమ్మతో ప్రదర్శనగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మానవహారంగా ఏర్పడి అరగంటపాటు నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. ముందుగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.కిరణ్, నగర కార్యదర్శి పి.రాంబాబు, ఐద్వా నగర కార్యదర్శి కె.రమాదేవి మాట్లాడుతూ.. నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ధ్వజమెత్తారు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఒత్తిడి తట్టుకోలేకే కడపలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నారాయణను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు సీహెచ్ వినోద్, నాయకులు చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్‌యూ ఆధర్యంలో దిష్టిబొమ్మ దహనం కడప నారాయణ విద్యా సంస్థల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పీడీఎస్‌యూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌కు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నారాయణ విద్యా సంస్థల దిష్టిబొమ్మ ద హనం చేశారు. గుర్తింపులేని నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలని, నారాయణను మంత్రి వర్గం నుంచి తొలగించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే మల్లికార్జున్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్యామ్, నాయకులు జీవన్, తరుణ్, పీవైఎల్ నాయకుడు నాగరాజు, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో.. ఒంగోలు : కడప నారాయణలో విద్యార్థినుల మృతిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవార ం బంద్ నిర్వహించారు. స్థానిక మంగమూరు డొంకలోని ఓ ప్రైవేట్ కళాశాల సిబ్బందికి, ఏబీవీపీ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని కళాశాలకు సెలవు ప్రకటించడంతో ఏబీవీపీ విద్యార్థులు వెనుదిరిగారు. ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి విష్ణు మాట్లాడుతూ.. కడపలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని చెప్పడం సిగ్గుచేటన్నారు. సెలవు దినాల్లో సైతం కాలేజీలు నిర్వహించడం వల్లే ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు వంశీ, రాజేష్, సుదీర్, మణి, అన్వేష్, నరసారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, హేమంత్, గణేష్, విజయ్ పాల్గొన్నారు. -
ఇలా అయితే.. రాజీనామా చేస్తా
ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.సురేశ్ కుమార్ ♦ మేం ఆత్మహత్య చేసుకుంటాం.. ఆత్మాహుతి దాడికి పాల్పడతాం ♦ పలు విద్యార్థి సంఘాల నేతల ఆగ్రహం ♦ ఓయూలో పీహెచ్డీ ప్రవేశ కటాఫ్ మార్కులపై తీవ్ర వాగ్వాదం సాక్షి, హైదరాబాద్: పీహెచ్డీ ప్రవేశ కటాఫ్ మార్కుల తగ్గింపు విషయంపై ఓయూ గెస్ట్‌హౌజ్ బుధవారం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు, రిజిస్ట్రార్ మధ్య మాటలు తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. ఓయూకి దేశంలో మొదటి స్థానం లభించిన సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఎంఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, బీఎస్ఎఫ్ వం టి సంఘాల విద్యార్థులు గెస్ట్‌హౌజ్‌లోకి దూసుకొ చ్చి ఆవేశంగా మాట్లాడారు. ‘మాకు పీహెచ్డీ ప్రవేశాల్లో అన్యాయం జరుగుతోంది. మేం ఆర్ట్స్ కళాశాల ముందు ఆత్మహత్యలకు పాల్పడుతాం. అవసరమైతే ఆత్మాహుతి దాడి చేస్తాం. భౌతిక దాడులకూ పాల్పడుతాం’ అనడంతో రిజిస్ట్రార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యార్థుల బెదిరింపులు చెల్లవని.. అవసరమైతే రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. ఆవేదనతో మాట్లాడుతున్నాం: ‘ఆవేదనతో మాట్లాడుతున్నాం. మా జీవితాలు నాశనం అవుతున్నాయ్. ఒక రిజిస్ట్రార్ డిప్యూటీ సీఎంను తప్పుదోవ పట్టించొచ్చా? ఒక డీన్ రిజైన్ చేస్తానన్నాడంటా? మరో ముగ్గురు లైన్లో ఉన్నారంటా? వారెవరో చెప్పాలి?’ అని విద్యార్థులు ప్రశ్నించారు. కటాఫ్ తగ్గినందునే పలువురి అర్హత.. ‘మీరు ఇచ్చిన వినతి పత్రంపై స్టాండింగ్ కమిటీలో వివిధ స్థాయిల్లో చర్చ జరిగింది. అందుకే ఎస్సీ, ఎస్టీలకు 40 నుంచి 30 మార్కులకు తగ్గించాం. ఇలా చేస్తేనే కొంత మంది అర్హత సాధించారు’ అని అన్నారు. తర్వాత విద్యార్థులు మాటలు వెనక్కి తీసుకుని రిజిస్ట్రార్‌కు క్షమాపణ చెప్పారు. ‘ డిప్యూటీ సీఎం, ఇన్‌ఛార్జి వీసీ వద్దే తేల్చుకుందాం.. రండీ’ అని విద్యార్థులను రిజిస్ట్రార్ ఆహ్వానించారు. దీంతో గొడవ అక్కడితో ముగిసింది -
డీఈఓ ఘెరావ్
సిద్దిపేట జోన్ : పట్టణంలో శుక్రవారం పాఠశాలల ఆకస్మిక తనిఖీకి వచ్చిన డీఈఓ రాజేశ్వరరావును పలు విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని ఘెరావ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు లను నియంత్రించాలని డిమాండ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పలు విద్యా సంస్థలు విపరీతంగా ఫీజులను పెంచాయం టూ ఆరోపిస్తూ పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డీఈఓ సిద్దిపేటకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు ముందుగా స్థానిక హైస్కూల్ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి డీఈఓ కారును అడ్డుకుని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశా రు. అక్కడి నుంచి పట్టణంలోని పలు ప్రైవే టు విద్యా సంస్థలను సందర్శించిన డీఈఓకు రెం డో సారి శ్రీచైతన్య స్కూల్ వద్ద విద్యార్థి సంఘా ల నుంచి నిరసన వ్యక్తమైంది. ఫీజు నియంత్రణ కమిటీ మండలి ఆధ్వర్యంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఈఓకు రెండోసారి అందజేశారు. డీఈఓ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ సమస్యపై సత్వరం స్పందిస్తామని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫీజు నియంత్రణ కమిటీ ప్రతినిధులు రమేష్, శ్రీకాంత్, కుమార్, పురుషోత్తం, ప్రభాకర్, యాదగిరి, సంపత్, భరత్, ఏబీవీపీ నాయకులు నాగరాజు, లింగం, సాయి, తిరుమలేష్, నవీన్‌లు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల తీరుపై డీఈఓ అసంతృప్తి పట్టణంలోని ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై డీఈఓ రాజేశ్వరరావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా శుక్రవారం ఆయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సమయంలో పాఠశాలలో ఉర్దూ మీడియానికి సంబంధించి ఐదు తరగతులకు గాను ఆరుగురు విద్యార్థులే ఉండడం (రిజిస్టర్ 12 మంది ఉన్నారు), వీరికి బోధించేందుకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండడంపై డీఈఓ రాజేశ్వర రావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఎంఈఓ నాగరాజును, పాఠశాల ఇన్చార్జ్ జమీర్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వెంటనే సంబంధిత ఉర్దూ మీడియం విద్యార్థులను పట్టణంలోని ఉర్దూ పాఠశాలలోకి మార్పు చేసేలా దరఖాస్తు అందజేయాలని సూచించారు. అవసరమైతే ఉపాధ్యాయులను కూడా అక్కడికి బదిలీ చేయాలని ఆదేశించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను తనిఖీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటు విద్యా సంస్థల వైఖరి తనకు అసంతృప్తి కలిగించిందని, ఇదే చివరి గడువుగా ఆయన అల్టిమేటం జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలన్నీ ఈ యేడు ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలనే వినియోగించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలను తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఈ సందర్భంగా ప్రైవేటు పుస్తకాలు తన దృష్టికి వస్తే అవసరమైతే పాఠశాల సీజ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదన్నారు. ఆయన వెంట సంగారెడ్డి, సిద్దిపేట డిప్యూటీ డీఈఓలు శ్యాంప్రసాద్‌రెడ్డి, మోహన్, సిద్దిపేట ఎంఈఓ నాగరాజు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి తదితరులున్నారు. డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా సంగారెడ్డి మున్సిపాలిటీ : ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను భర్తీ చేయకుండా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి సంఘనేతలపై కేసు నమోదు... జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావును అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించినందుకు 13 మంది విద్యార్థి సంఘ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండల విద్యాధికారి నాగరాజు ఫిర్యాదు మేరకు విద్యార్థి సంఘ నేతలు రమేష్, యాదగిరి, భరత్, పురుషోత్తం, సంపత్, కుమార్, ప్రభాకర్, అంజి, నవీన్, సాయి, లింగం, లక్ష్మణ్, నాగరాజులపై వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. -
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం
ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ భూముల వ్యవహారంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమని విద్యార్థి సంఘాల నాయకలు పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్, అధ్యక్షులు కోటూరి మానవతరాయ్, అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి ఆర్ట్స్ కళాశాల ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో చదువుకొని కేటీఆర్ ఓయూ భూములను తీసుకుంటే తప్పెంటని పేర్కొనడం దారుణమన్నారు. ఓయూ భూములు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పూర్వికులు సంపాదించినవి కాదని, అవి విద్యార్థుల సొత్తని అన్నారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఓయూ భూముల పరిరక్షణ కోసం జూన్ 1న ఓయూలో ‘విద్యార్థి నిరుద్యోగుల సింహగర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీయడంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓయూ భూముల జోలికొస్తే ఊరుకోం:ఎన్‌టీవీపీ సరూర్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూ భూముల జోలికొస్తే ఊరుకోబోమని నవ తెలంగాణ విద్యార్ధి పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సర్ధార్ వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం బాలాపూర్ చౌరస్తాలో ఓయూ భూముల ఆక్రమణలను వ్యతిరేకిస్తూ సూర్ణగంటి రంజిత్‌కుమార్ అధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతో కేసీఆర్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టిన తాము మరో ఉద్యమం చేసి గద్దె దింపుతామని హెచ్చరించారు. చదువుల తల్లి సరస్వతి కొలువైన నేలను లాక్కొని ఇళ్లు కట్టిస్తానననడం సబబు కాదన్నారు. కేసీఆర్ తన ఫాంహౌస్‌లను ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దిలిఫ్, అశోక్, వంశీ, సాయి, రోహిత్, శివ, రాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములమవుతాం
మహేశ్వరం : అరవై ఏళ్ల ఉద్యమం, అమరవీరుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. రాష్ట్రసాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులు... బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ భాగస్వాములవుతారని పేర్కొంటున్నారు. పోలీసు తూటాలను ఎదిరించి, లాఠీదెబ్బలకోర్చి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి రాజకీయావకాశాలు కల్పిస్తే నవ తెలంగాణ సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు విద్యార్థి సంఘాల నేతలు ‘న్యూస్‌లైన్’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కేసులు ఎత్తివేయాలి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. భవిష్యత్తును ఏమాత్రం లెక్కచేయకుండా విద్యార్థులు తెలంగాణ కోసం ర్యాలీలు, నిరాహార దీక్షలు చేపట్టారు. సీమాంధ్రుల పాలనలో సరైన ఉద్యోగాలు లభించక ఇంజినీరింగ్ తదితర పట్టభద్రులు ఖాళీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువకుల పాత్రను గుర్తించి వారికి తక్షణం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత నిర్బంధ విద్యను పకడ్బందీగా అమలుచేయాలి. - గోనమోని జనార్దన్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రావిర్యాల ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు కల్పించాలి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. అందుకే మలిదశ ఉద్యమంలో యువత పెద్దఎత్తున పాల్గొంది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ తదితర కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం యువతకు న్యాయం చేయాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. యువతకు రాజకీయాల్లోనూ అవకాశం ఇవ్వాలి. - రాఘవేందర్‌రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు, మన్సాన్పల్లి చదువులు పణంగా పెట్టి... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలామంది విద్యార్థులు చదువులను పణంగా పెట్టి పోరాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న సీమాంధ్ర మంత్రులను, ఇక్కడి ప్రజాప్రతినిధులను సైతం ఊళ్లల్లోకి రాకుండా అడ్డుకొని లాఠీదెబ్బలు కూడా తిన్నారు. రాజకీయపక్షాల కంటే విద్యార్థులే ఉద్యమంలో ముందుండి తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేంతవరకూ పోరాడారు. అలాంటి వారికి ప్రభుత్వం న్యాయం చేయాలి. ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కృషి చేయాలి. ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులు ప్రవేశపెట్టి విద్యార్థులకు భరోసా కల్పించాలి. - పల్నాటి నరేష్, టీఆర్ఎస్వీ నాయకుడు, నాగారం సమగ్రాభివృద్ధే ధ్యేయం కావాలి నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువకులు కలసికట్టుగా ఉద్యమించారు. విద్యార్థి జేఏసీ నాయకుడిగా నా వంతుగా తెలంగాణ వెనుకబాటుతనాన్ని పాటల ద్వారా విద్యార్థులకు తెలియజేసి చైతన్యవంతులను చేశాను. అమరవీరుల త్యాగం, రాజకీయ పక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాల సమష్టి ఉద్యమం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేయాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు కల్పించాలి. - రాజేష్ నాయక్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకుడు, నాగిరెడ్డిపల్లి తండా