సిద్దిపేట జోన్ : పట్టణంలో శుక్రవారం పాఠశాలల ఆకస్మిక తనిఖీకి వచ్చిన డీఈఓ రాజేశ్వరరావును పలు విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని ఘెరావ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు లను నియంత్రించాలని డిమాండ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పలు విద్యా సంస్థలు విపరీతంగా ఫీజులను పెంచాయం టూ ఆరోపిస్తూ పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డీఈఓ సిద్దిపేటకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు ముందుగా స్థానిక హైస్కూల్ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి డీఈఓ కారును అడ్డుకుని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశా రు.
అక్కడి నుంచి పట్టణంలోని పలు ప్రైవే టు విద్యా సంస్థలను సందర్శించిన డీఈఓకు రెం డో సారి శ్రీచైతన్య స్కూల్ వద్ద విద్యార్థి సంఘా ల నుంచి నిరసన వ్యక్తమైంది. ఫీజు నియంత్రణ కమిటీ మండలి ఆధ్వర్యంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఈఓకు రెండోసారి అందజేశారు. డీఈఓ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ సమస్యపై సత్వరం స్పందిస్తామని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫీజు నియంత్రణ కమిటీ ప్రతినిధులు రమేష్, శ్రీకాంత్, కుమార్, పురుషోత్తం, ప్రభాకర్, యాదగిరి, సంపత్, భరత్, ఏబీవీపీ నాయకులు నాగరాజు, లింగం, సాయి, తిరుమలేష్, నవీన్‌లు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల తీరుపై డీఈఓ అసంతృప్తి
పట్టణంలోని ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై డీఈఓ రాజేశ్వరరావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా శుక్రవారం ఆయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సమయంలో పాఠశాలలో ఉర్దూ మీడియానికి సంబంధించి ఐదు తరగతులకు గాను ఆరుగురు విద్యార్థులే ఉండడం (రిజిస్టర్ 12 మంది ఉన్నారు), వీరికి బోధించేందుకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండడంపై డీఈఓ రాజేశ్వర రావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఎంఈఓ నాగరాజును, పాఠశాల ఇన్‌చార్జ్ జమీర్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వెంటనే సంబంధిత ఉర్దూ మీడియం విద్యార్థులను పట్టణంలోని ఉర్దూ పాఠశాలలోకి మార్పు చేసేలా దరఖాస్తు అందజేయాలని సూచించారు.
అవసరమైతే ఉపాధ్యాయులను కూడా అక్కడికి బదిలీ చేయాలని ఆదేశించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను తనిఖీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటు విద్యా సంస్థల వైఖరి తనకు అసంతృప్తి కలిగించిందని, ఇదే చివరి గడువుగా ఆయన అల్టిమేటం జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలన్నీ ఈ యేడు ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలనే వినియోగించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలను తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఈ సందర్భంగా ప్రైవేటు పుస్తకాలు తన దృష్టికి వస్తే అవసరమైతే పాఠశాల సీజ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదన్నారు. ఆయన వెంట సంగారెడ్డి, సిద్దిపేట డిప్యూటీ డీఈఓలు శ్యాంప్రసాద్‌రెడ్డి, మోహన్, సిద్దిపేట ఎంఈఓ నాగరాజు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి తదితరులున్నారు.
డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా
సంగారెడ్డి మున్సిపాలిటీ : ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను భర్తీ చేయకుండా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థి సంఘనేతలపై కేసు నమోదు...
జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావును అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించినందుకు 13 మంది విద్యార్థి సంఘ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండల విద్యాధికారి నాగరాజు ఫిర్యాదు మేరకు విద్యార్థి సంఘ నేతలు రమేష్, యాదగిరి, భరత్, పురుషోత్తం, సంపత్, కుమార్, ప్రభాకర్, అంజి, నవీన్, సాయి, లింగం, లక్ష్మణ్, నాగరాజులపై వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి కేసు నమోదు చేశారు.
డీఈఓ ఘెరావ్
Published Sat, Jun 20 2015 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM
Advertisement