విద్యార్థి సంఘ నాయకులు
ఏఎన్‌యూ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమని దానికోసం జరిగే పోరాటంలో తామెప్పుడూ భాగస్వాములమవుతామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈనెల 26వ తేదీనుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో చేపడుతున్న నిరాహారదీక్షకు విద్యార్థులను సమాయత్తం చేసేందుకు మంగళవారం యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పాస్ట్రల్ సెంటర్ ప్రాంగణంలో సమావేశం జరిగింది.
హోదా రాకపోతే గాఢాంధకారమే...
సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ఎం.రాజన్న మాట్లాడుతూ ప్రత్యేక హో దా లేకపోతే విద్యార్థుల జీవితాలు అంధకారమవుతాయన్నారు. ఇప్పటికే రెండేళ్లుగా ఉద్యోగాలు లేక యువతీ యువకులు తీవ్ర నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు పవన్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా సాధన పోరాటానికి ఎస్‌ఎఫ్‌ఐ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. ఓసీఎస్‌ఎఫ్ నాయకులు వెంకటరెడ్డి మా ట్లాడుతూ నవ్యాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ ముందుండి పోరాటం చేయటం మంచి పరిణామమన్నారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎస్‌ఎఫ్) నాయకుడు రాజేష్ మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు తమ సంఘం పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు.
మద్దతు ఇవ్వడం మనందరి బాధ్యత
ఎస్టీఎస్‌ఎఫ్ నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల మేలుకోరి జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేస్తున్నారని దానికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత తమందరిపై ఉందన్నారు. బీసీ విద్యార్థి సంఘ నాయకుడు గంగాధర్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయని దాని ద్వారా పరిశ్రమలు వచ్చి అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ విద్యార్థులందరూ ఏకతాటిపై ఉండి జగన్‌దీక్షను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్డీఎస్‌ఎఫ్ నాయకుడు గోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ గుం టూరు జిల్లా ప్రధానకార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, గుంటూరు నగర సేవాదళ్ అధ్యక్షులు కొండారెడ్డి, రూరల్ మండల కన్వీనర్ రాజు, పార్టీ నాయకులు గులాం రసూల్, బ్రహ్మారెడ్డి, ప్రవీణ్‌రెడ్డి,కర్ణుమా తదితరులు పాల్గొన్నారు.
ఏఎన్‌యూ సమస్యలపై జగన్ నేతృత్వంలో పోరాటం
ఏఎన్‌యూలో విద్యార్థి సంఘాలపై ఉన్న ఆంక్షలు, విద్యార్థులను అధికారులు పెడుతున్న ఇబ్బందులపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పోరాటం చేస్తామని లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఈ స్థాయికి ఎదగటానికి వాళ్ళు ఒకప్పుడు యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల్లో పనిచేయటమే కారణమనే విషయం మరిచారన్నారు.విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారన్నారు. పరిస్థితులను వివరించేందుకు ఏఎన్‌యూ విద్యార్థులను గుంటూరులో జగన్‌మోహన్ రెడ్డితో సమావేశపరుస్తామని చెప్పారు.
ప్రత్యేక హోదానే లక్ష్యం
Published Wed, Sep 23 2015 3:03 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement