వారణాసిలోవిద్యార్థి నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయ్ప్రతాప్ కాలేజీలోని విద్యార్థి నాయకుడు వివేక్ సింగ్( 22) ను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. క్యాంపస్‌లోని హాస్టల్‌ముందు ఆదివారం రాత్రి ఈ ఘటన జరింది. ఈ నేపథ్యంలో కాలేజీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లా మేజిస్ట్రేట్ సురేంద్ర సింగ్ కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను శాంతింప జేసేందుకు ప్రయత్నించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటను జరగకుండా పోలీసులు బలగాలను మోహరించారు.
అజాంగఢ్ జిల్లాలోని జముండేహ్ గ్రామంలోని బి.కాం రెండవ సంవత్సరం విద్యార్ధిగా వివేక్ సింగ్‌ను పోలీసులు గుర్తించారు. .32 బోర్ పిస్తోల్‌తో నిమిది సార్లు కాల్పులు జరిపారని పోలీసు అధికారి ఆనంద్ కులకర్ణి వెల్లడించారు. రక్తపు మడుగులో కొట్టిమిట్టాడుతున్న అతణ్ని సహచర విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా, అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారన్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సహా పోలీసుల ఏడు బృందాలు హంతకులను గుర్తించే పనిలో పడ్డాయని అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment