Ramanthapur
-
హైదరాబాద్ లో దొంగ డాక్టర్ గుట్టు రట్టు
-
రామాంతపూర్ వివేక్ నగర్ లో పేలిన బ్యాటరీ బైక్
-
హైదరాబాద్ రామాంతాపూర్ లో దారుణం
-
హైదరాబాద్: షటిల్ ఆడుతూ కుప్పకూలి మృతి
హైదరాబాద్: వయసు తేడాలు లేకుండా.. హఠానర్మణాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ మరణాలు ప్రజల్లో భయాందోళన కల్గిస్తున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వాళ్లు.. కార్డియాక్ అరెస్ట్ లేదంటే గుండెపోటుతోనో కుప్పకూలి కన్నుమూస్తున్నారు. తాజాగా.. నగరంలోనూ అలాంటి మరణం ఒకటి సంభవించింది. షటిల్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు ఓ వ్యక్తి. బుధవారం ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి (46)గా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు ఆయన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్దారించారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: పిల్లలు లేరనే ఆవేదనతో.. -
హైదరాబాద్ లో పట్టాపగలు చోరీకి పాల్పడిన చిన్నారి..
-
Hyderabad: బయటకు వెళ్లొస్తానని చెప్పి.. యువకుడు అదృశ్యం
సాక్షి, లక్డీకాపూల్ : సాయంత్రం సరదాగా బయటికి వెళ్లి వస్తానని చెప్పిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. యువకుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామంతాపూర్ ప్రాంతానికి చెందిన రోహిత్ మనోజ్ (19)(బబ్లూ) ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అతడి కోసం గాలించినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో అతడి మేనమామ బోడపాటి శ్రీనివాసరావు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. ఇంటినుంచి బయటికి వెళ్లిన సమయంలో రోహిత్ మనోజ్ నలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని వద్ద ఫోన్ కూడా లేదని ,కేవలం స్టూడెంట్ బస్ పాస్ మాత్రమే ఉందన్నారు. అతడి ఆచూకీ తెలిస్తే 9493106929, 9912199554, 98661311010 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: డెక్కన్ మాల్ కూల్చివేతకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్) -
హబ్సిగూడలో కారు బీభత్సం
సాక్షి, లాలాపేట: మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ హబ్సిగూడ ప్రధాన రహదారిలో బీభత్సం సృష్టించారు. నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను, ఓ స్కూటీని ఢీకొట్టిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహిస్తున్న మౌర్య తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పూటుగా మద్యం తాగారు. ఉదయం ఒక్కడే మౌర్య 8 గంటలకు హబ్సిగూడ స్ట్రీట్ నంబర్–8 నుంచి సికింద్రాబాద్‌కు కారులో బయలుదేరారు. కొద్ది సేపటికే మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారుతో రామంతాపూర్ వైపు వెళ్తున్న ఓ ఆటోను, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఆటో, స్కూటీ నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లు హరీష్, శ్రీనివాస్, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మొత్తం నలుగురు వ్యక్తులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. కారు డ్రైవర్ మౌర్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉందని ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. (చదవండి: హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే) -
ప్రిన్సిపాల్ రూమ్‌లో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: రామంతాపూర్ నారాయణ కాలేజీలో గాయపడిన విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. అయితే యశోద ఆసుప్రతిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. సందీప్ సహా వెంకటేష్‌చారీ, కాలేజ్ ఏవో అశోక్‌కు డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు హైదరాబాద్ నారాయణ కాలేజీకి తెలంగాణ ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసింది. రామాంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. టైం టు టైం ఏం జరిగిందంటే ► 12:20కి కాలేజ్ వచ్చిన సాయి నారాయణ అతని స్నేహితుడు సందీప్‌తో పాటు మరో ఆరుగురు ►12:35 ప్రిన్సిపాల్ ఛాంబర్లోకి వెళ్లిన సాయి నారాయణ స్నేహితులు ►12:40కి ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో సర్టిఫికెట్ విషయంలో వాగ్వివాదం ►12:43కి పెట్రోల్ పోసుకున్న సందీప్ అనే విద్యార్థి సంఘం నాయకుడు ►12:43కి ప్రిన్సిపాల్ రూమ్‌లో మంటలు రావడంతో ఛాంబర్లోకి పరుగెత్తిన ఏఓ అశోక్ ►12:44 కి ప్రిన్సిపాల్ రూమ్‌లో నుంచి పరుగు ఎత్తడం తో ఏఓ అశోక్ ను పట్టుకున్న సందీప్ ►12:45కి గాయాలతో బయటకు వచ్చిన సందీప్, అశోక్ ►12:45 కి మంటలు ఆర్పిన సిబ్బంది ►12:50కి విద్యార్థి నాయకుడు సందీప్, అశోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు ► 1:20కి గాంధీ ఆస్పత్రికి చేరుకున్న బాధితులు. అక్కడి నుంచి యశోద, డీఆర్డీఓ ఆసుపత్రికి బాధితులను తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై స్పందించిన మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. నారాయణ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఆ విద్యాసంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థి విద్యా సంవత్సరం కోల్పోతాడు.. ఫీజులు కట్టకపోతే వేరే మార్గాల ద్వారా తీసుకోవాలి తప్ప.. సర్టిఫికెట్లు ఇవ్వవద్దని ఏ చట్టంలోనూ లేదు. నారాయణ యాజమాన్యం చేసింది.. రాజ్యాంగ వ్యతిరేక చర్య.. ఇది అత్యంత హేయమైన, దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. చదవండి: ‘ఫీజు విషయంలోనే వివాదం.. ప్రిన్సిపాల్ వెనక్కి తగ్గకపోవడంతో’.. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పొరేట్ కాలేజీలు దోచుకుంటున్నాయని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మండల కేంద్రాల్లోకి సైతం నారాయణ, చైతన్య కాలేజీలు విస్తరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో సైతం ఇవి లేవు. మండల కేంద్రాలకు సైతం నారాయణ, చైతన్య విద్యాసంస్థలు వచ్చి.. ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు... తగిన చర్యలు తీసుకోలేదని మధుయాష్కీ మండిపడ్డారు. -
అంబర్పేట్ నారాయణ కాలేజ్‌లో దారుణం
-
నారాయణ కాలేజీ వద్ద టెన్షన్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: నగరంలో అంబర్‌పేట్‌లోని నారాయణ జూనియర్ కాలేజీ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి కాలేజీ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగి ఉద్రిక్తత నెలకొంది. వివరాల ప్రకారం.. నారాయణ కాలేజీకి చెందిన నారాయణ స్వామి అనే విద్యార్థి.. కాలేజీ యాజమాన్యం తనకు టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ఘటనలో నారాయణ స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. సిబ్బంది వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్, మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ఇది కూడా చదవండి: మునావర్ ఫరూకీ కామెడీ షోకి గ్రీన్‌సిగ్నల్.. రాజాసింగ్ వార్నింగ్.. -
మూసీనది ఆక్రమణలతోనే వరదలు
సాక్షి, హైదరాబాద్: మూసీనది ఆక్రమణలకు గురికావడం వల్లే హైదరాబాద్‌లో వర్షాలు కురిసినప్పుడు వరదలు పోటెత్తుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్వర్ణోత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రకృతి చాలా ముఖ్యమైనదని, నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదమని అన్నారు. నదుల ఆక్రమణలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. దేశంలోని ఉన్నతమైన విద్యాసంస్థల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని కొనియాడారు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, కృషితోనే మంచి భవిష్యత్ సాధ్యమని విద్యార్థులకు సూచించారు. వ్యాయామం అవసరం శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసిక ఉల్లాసం లభిస్తుందని, ప్రతిరోజు శరీరానికి వ్యాయామం అవసరమని వెంకయ్యనాయుడు సూచించారు. యోగా అనేది మోదీది కాదని, వ్యాయామానికి కులమతాల భేదాలు లేవని అన్నారు. సంగీతం, సాహిత్యం రోజువారీ జీవితంలో భాగం కావాలని, ప్రకృతిని, సంస్కృతిని ఆరాధిస్తూ జీవితాన్ని సాఫీగా గడపాలన్నారు. చదువు కోసం చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని, అనంతరం దేశం కోసం పనిచేయడానికి తిరిగి రావాలన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సింహారెడ్డి, హెచ్పీసీ అధ్యక్షుడు శ్యామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏయ్.. నేను ఊదనంటే ఊదను.. పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన మందుబాబు
-
కిషన్ రెడ్డి సభ.. కార్పొరేటర్‌కు షాకిచ్చిన జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్: రామాంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని రూ.80వేల జరిమానా విధించింది. శనివారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ భారీ జరిమానా విధించింది. -
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచమర్రి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంభీరావుపేట మండలానికి చెందిన అల్లెపు రాము అనే వ్యక్తి కామారెడ్డి వైపు వెళ్తుండగా మహిళ లిఫ్ట్ అడగటంతో ఆమెను కూడా బైక్‌పై తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బైకుపై ఉన్న ఇద్దరూ పల్టీ కొట్టి ముందుకు పడ్డారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రామంతపూర్‌లో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థి మృతి హైదరాబాద్: ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్ డీమార్ట్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా అతివేగంతో వస్తున్న డ్యుక్ బైక్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న బీటెక్ విద్యార్థి సర్వ రేవంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు రేవంత్ రామంతాపూర్ ఆనంద్ నగర్ నివాసిగా గుర్తించారు. మృతుడు బైక్ నడుపుతూ డివైడర్ ను ఢీకొన్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.. -
హైదరాబాద్‌లో ఇదేం విచిత్రం.. షీ టాయిలెట్లలో షాపులా?
సాక్షి, రామంతాపూర్: వివిధ పనుల నిమిత్తం ఇళ్లనుంచి బయటకు వచ్చే నగర మహిళలు అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళల ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ షీ టాయిలెట్ల ఏర్పాటు చేసింది. అయితే వాటి నిర్వహణ అగమ్యగోచరంగా తయారవడం మహిళల పాలిట శాపంలా తయారవుతోంది. వివరాలివీ... రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి ఐడీఏ ఉప్పల్ సమీపంలో మోడ్రన్ బేకరీ ఎదురుగా ఉన్న బస్టాండ్ ఆనుకొని షీ టాయిలెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ షీ టాయిలెట్లను బస్సుల కోసం ఎదురు చూసే మహిళలతో పాటు స్థానికంగా ఉన్న ఐడీఏ ఉప్పల్‌లో పలు ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికులు వినియోగిస్తుంటారు. అయితే షీ టాయిలెట్ అని చూడకుంగా వీటిని ఆనుకొని షాపులు ఏర్పాటు చేశారు. ఈ షాపులను పురుషులే నిర్వహిస్తున్నందున చాలామంది మహిళలు షీ టాయిలెట్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపడంలేదు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యాలకు గురవుతున్నారు. ఈ టాయిలెట్లను ఆనుకొని ఉన్న షాపులను దూరంగా తరలించాలని లేదా ఈ షీ టాయిలెట్‌ను మహిళలే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు. -
వంద పడకలు.. ముగ్గురే బాధితులు
రామంతాపూర్: ఉప్పల్ సర్కిల్లోని రామంతాపూర్, ఉప్పల్, హబ్సిగూడ, చిలుకానగర్ డివిజన్లకు చెందిన వందలాది మంది ప్రతిరోజు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రంతో పాటు బస్తీ దవాఖానాలో కరోనా పరీక్షలు చేసుకుంటున్నారు. చాలా మంది కోవిడ్ బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ సోకే అవకాశం ఉందని రామంతాపూర్ ప్రభుత్వ హోమియో ఆస్పత్రిలో వంద పడకలతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో చేరుదామని ఆశగా వస్తున్నారు. కానీ ఈ కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. వంద పడకలతో ఏర్పాటుచేసిన ఈ ఐసోలేషన్ కేంద్రంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇప్పటివరకు ముగ్గురే చేరారు. దీంతో ఐసోలేషన్ కోసం ఏర్పాటు చేసిన పడకలు నిరుపయోగంగా మారాయి. ఐసోలేషన్ కేంద్రంలో అపరిశుభ్ర వాతావరణంతో పాటు పల్స్ యాక్సిలేటర్, ఆక్సిజన్ సిలిండర్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. గత ఆదివారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఐసోలేషన్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేయగా బెడ్లు ఖాళీగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ఐసోలేషన్ సెంటర్‌ను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించించా ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని సెంటర్లో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ( చదవండి: కరోనా విజృంభిస్తోంది.. ఇకనైనా మారండి సారు ) -
సినిమా షూటింగ్లో ఎన్నికల ప్రచారం
రామంతాపూర్: రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం జరిగిన తెలుగు సినిమా షూటింగ్‌కు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని షూటింగ్లో పాల్గొన్న హీరో సుధీర్‌బాబు, డైరెక్టర్ కర్ణ కుమార్, ప్రొడ్యూసర్ చల్లా విజయ్‌కుమార్‌లను ఆయన కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, సుధాకర్, సాంబశివరావు, జేసీబీ రాజు, అంగడి సాయి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో రూ. 60కే ‘తిన్నంత బిర్యానీ’
సాక్షి, హైదరాబాద్: నగరంలో బిర్యానీ అంటే తెలియనివారు ఉండరు. వారాంతపు సెలవుల్లో బిర్యానీ సెంటర్లల్లో జనాలు బారులు తీరుతారు. అయితే మంచి బిర్యానీ కోసం భాగ్యనగర వాసులు ఎక్కడినైనా వేళ్లడానికి ఆసక్తి చూపుతారు. చిన్నా, పెద్ద ఇష్టంగా ఆరగించే బిర్యానీ.. పెద్ద హోటళ్లలో లభిస్తున్నప్పటికీ సామాన్యులు తినాలంటే మాత్రం భారంగా మారుతోంది. కానీ, హైదరాబాద్‌లో ఇప్పుడు వేడివేడి బిర్యానీ కేవలం రూ. 60 లభిస్తోంది. అది ఎక్కడని అశ్చర్యపోకండి. ఉప్పల్ చౌరస్తా నుంచి రామంతాపూర్‌కు వెళ్లే మార్గంలో ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్లో రుచికరమైన బిర్యానీ లభ్యమవుతోంది. వివరాలు.. ఉదయ్, కిరణ్ అన్నదమ్ములిద్దరు కలిసి స్టార్టప్‌గా ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్ ప్రారంభించారు. బిర్యానీతోపాటు అదనంగా గ్రేవీ, సలాడ్, పెరుగు, స్వీట్, మినరల్ వాటర్ ఇస్తున్నామని తెలిపారు. అయితే ఇది పూర్తిగా శాకాహారంతో కూడిన బిర్యానీ. అయతే తిన్నంత బిర్యానీ పెడతామని పేర్కొన్నారు. ఇటీవలె బిర్యానీ సెంటర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ జనాల్లో ఆదరణ పెరుగుతోందని తెలిపారు. తక్కువ ధర అని నాసిరకం కాకుండా బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. రోజు రూ. 1000 నుంచి రూ.1,500 వరకు పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. రోజు ఎంతో రద్దీగా ఉండే ఉప్పల్-రామంతాపూర్ మార్గంలో రూ.60 చెల్లించి ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్లో బిర్యానీ తింటున్నామని, చాలా రుచిగా ఉందని స్థానికులు తెలిపారు. చదవండి: శని, ఆదివారాలు చెక్కులిచ్చినా.. లిక్కర్ ఇస్తాం -
ఉప్పల్ రామంతాపూర్‌లో దారుణం
-
రామంతపూర్‌లో రెచ్చిపోయిన మందు బాబులు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మందుబాబులు రెచ్చిపోయారు. కర్ఫ్యూ అంక్షలను ఏ మాత్రం పట్టించుకోకుండా మెయిర్ రోడ్డుపై మందు పార్టీ చేసుకున్నారు. రామంతపూర్‌లోని టీవీ స్టూడియో ప్రధాన ద్వారం ముందు, పోలీస్ చెక్‌పోస్ట్‌కు కూత వేటు దూరంలో మందు బాబులు దర్జాగా పార్టీ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెయిన్ రోడ్డుపై కొందరు మందు పార్టీ చేసుకునేది పోలీసులు గమనించినా ప్రేక్షకపాత్రే వహించారని, సంఘటనా స్థలానికి మీడియా చేరుకోగానే అప్రమత్తమైన పోలీసులు వారిపై పిటీ కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని స్థానికలు విమర్శిస్తున్నారు. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. -
కర్ఫ్యూ టైం: మెయిన్ రోడ్డుపై మందు పార్టీ
-
కిరాణా వర్తకుడికి కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: రామాంతపూర్‌లోని ఓ కిరణా వర్తకుడికి కరోనా పాజిటివ్ కలకలం రేపుతోంది. అతడిని చికిత్స నిమిత్తం శనివారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితుడి కుటుంబ సభ్యులైన మరో ఇద్దరిని పోలీసులు క్వారంటైన్‌కు పంపించారు. సదరు పాజిటివ్ వ్యక్తి నాగోల్‌లోని తన బంధువులను ఇటివల కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తి కలిసిన అతడి బంధువులను, కిరాణా షాపులో వస్తువులు కొన్న వారిపై ఆరా తీస్తున్నారు. కాగా కిరాణా షాపు వర్తకుడికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక సదరు బాధితుడు నివాసం ఉంటున్న శ్రీరమనపురంలోని కాలనీలకు జీహెచ్ఎంసీ బారీకేడ్లతో శుభ్రత చర్యలు చేపట్టింది. ఈ ఫొటోలోని చిన్నారికి కరోనా లేదు -
హైదరాబాద్‌లో పైశాచిక ఘటన
సాక్షి, హైదరాబాద్ : హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై కామాంధుడి దాడి మరవక ముందే హైదరాబాద్‌లో మరో పైశాచిక ఘటన చోటుచేసుకుంది. రామంతపూర్‌లో తొమ్మిదేళ్ల బాలికపై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రక్తస్రావంతో ఉన్న బాలికను ఆమె తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని మేస్త్రీ పనిచేసే లక్ష్మణ్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలి తల్లిదండ్రులు ఖమ్మం నుంచి నాలుగు నెలల క్రితం రామంతపూర్‌లోని టీవీ కాలనీకి వలస వచ్చి కూలీ పనిచేసుకుంటూ ఒక గుడిసెలో నివసిస్తున్నారు. గుడిసె ప్రక్కనే ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ మేస్ట్రీ పని చేసే లక్ష్మణ్(23), గుడిసెలో ఎవరు లేని సమయం చూసి బాలికపై అత్యాచారం చేశాడు. తీవ్ర రక్త స్రావంతో ఉన్న బాలికను గమనించిన స్థానికులు లక్ష్మణ్‌ను పట్టుకుని చితకబాదారు. స్థానికుల దాడి నుంచి తప్పించుకున్న నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. నిందితుని కోసం గాలింపు చేపట్టారు.