
నకిలీ కరెన్స్ వెదజల్లుతున్న టీఆర్‌ఎస్ నాయకులు
సాక్షి, హైదరాబాద్: ప్రగతి నివేదన సభ కోసం చేపట్టిన ర్యాలీలో నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది. ఆదివారం ఉప్పల్, రామంతాపూర్ స్థానిక కార్పోరేటర్ గంధం జ్యోత్స్ననాగేశ్వరరావు ఆధ్యర్యంలో జరిగిన ర్యాలీలో టీఆర్‌ఎస్ నాయకులు నకిలీ కరెన్సీని వెదజల్లారు. దీంతో అక్కడున్న కార్యకర్తలు, జనాలు అసలు నోట్లనుకుని ఏరుకునేందుకు పోటీపడ్డారు. తీరా అవి నకిలీ నోట్లని తెలియడంతో నిరాశకు లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నాయకులు వెదజల్లిన నకిలీ నోట్లు
Comments
Please login to add a commentAdd a comment