నగరంలోని రామాంతపూర్ చిన్న చెరువులో శుక్రవారం మృతదేహం కలకలం రేపింది. చెరువులో వ్యక్తి మృతదేహం తేలియాడటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హైదరాబాద్ : నగరంలోని రామాంతపూర్ చిన్న చెరువులో శుక్రవారం మృతదేహం కలకలం రేపింది. చెరువులో వ్యక్తి మృతదేహం తేలియాడటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా నగరంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఉన్ ప్పటికి వ్యక్తి చెరువులో మృతదేహం లభించడంపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా హతమార్చి తెచ్చి చెరువులో పడేశారా అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.