వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని కవ్వలకుంట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైంది.
మంగపేట: వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని కవ్వలకుంట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైంది. శుక్రవారం ఉదయం చెరువులో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని బయటికి తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేక ఎవరైన హత్య చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.