నదిలో వీఆర్‌ఏ మృతదేహం లభ్యం | dead body found in vamsadhara river | Sakshi
Sakshi News home page

నదిలో వీఆర్‌ఏ మృతదేహం లభ్యం

Published Tue, Dec 13 2016 11:01 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

dead body found in vamsadhara river

ఎల్.ఎన్.పేట(శ్రీకాకుళం): రెండు రోజుల క్రితం కనిపించకుండాపోయిన వీఆర్‌ఏ మృతదేహం లభించింది. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట(లక్ష్మీనర్సుపేట) మండలం తురకపేట రెవెన్యూ క్లస్టర్ వీఆర్‌ఏ సురాన త్రినాథరావు(50) రెండు రోజుల క్రితం విధి నిర్వహణ నిమిత్తమై వెళ్లి వంశధార నదిలో గల్లంతయ్యాడు.

మంగళవారం ఉదయం జలుమూరు మండలం నగరికటకం- అచ్యుతాపురం గ్రామాల మధ్య మృతదేహాన్ని గమనించిన స్థానికులు అక్కడ లభించిన ఆధారాల సాయంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని త్రినాథరావు మృతదేహాన్ని గుర్తించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ వారు ఎల్‌ఎన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement