గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభ్యం | dead body details found | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభ్యం

Published Wed, Aug 31 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

dead body details found

చింతలపూడి : చింతలపూడి మండలం యర్రగుంటపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆచూకీ లభించినట్టు ఎస్సై సైదానాయక్‌ మంగళవారం తెలిపారు. ఈ  మృతదేహం కర్ణాటక రాష్ట్రం, రాయ్‌చూర్‌ జిల్లా గిలకషుగర్‌గాయ్‌ గ్రామానికి చెందిన బొబ్బా శేషగిరిరావు (60)కు చెందినదిగా గుర్తించామన్నారు. దినపత్రికల్లో వచ్చిన మృతుని ఫొటో చూసి ద్వారకాతిరుమలలో ఉంటున్న అతని బంధువులు గుర్తుపట్టారని చెప్పారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతుడు అనారోగ్య కారణాలతో కొద్ది కాలంగా బాధపడుతున్నట్టు బంధువులు తెలిపారని ఎస్సై చెప్పారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement