ప్రత్యేక ఆంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మరణించిన బాలుడి పూర్తి వివరాలు తెలిశాయి. ఆ బాలుడు చందర్లపాడు మండలం తోటరావులపాడు హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న మల్లెల కొండ(14)గా గుర్తించారు. ‘గుర్తు తెలియని బాలుడు మృతి’ అనే శీర్షికన ‘సాక్షి’లో బుధవారం వార్త ప్రచురించిన విషయం తెలిసిందే.
మృతిచెందిన బాలుడి ఆచూకీ లభ్యం
Sep 23 2016 12:14 AM | Updated on Jul 12 2019 3:02 PM
‘సాక్షి’లో వచ్చిన వార్త చూసి గుర్తించిన ఉపాధ్యాయులు
పెనుగంచిప్రోలు/నందిగామ రూరల్ :
ప్రత్యేక ఆంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మరణించిన బాలుడి పూర్తి వివరాలు తెలిశాయి. ఆ బాలుడు చందర్లపాడు మండలం తోటరావులపాడు హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న మల్లెల కొండ(14)గా గుర్తించారు. ‘గుర్తు తెలియని బాలుడు మృతి’ అనే శీర్షికన ‘సాక్షి’లో బుధవారం వార్త ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తను చదివిన ఉపాధ్యాయులు వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మల్లెల కొండ మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లి పుస్తకాలు అక్కడ పెట్టి బయటకు వచ్చాడు. పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకునిపాలెం గ్రామంలో ఉన్న తన అమ్మమ్మను చూసేందుకు బయలుదేరాడు. పెనుగంచిప్రోలు వెళ్లే బస్సులో టికెట్ తీసుకున్న అనంతరం అపస్మారకస్థితిలో పడిపోయాడు. ప్రత్యేక అంబులెన్స్‌లో విజయవాడ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. బాలుడి మృతిపై పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మంగళవారం రాత్రి పోస్టుమార్టం కోసం నందిగామ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నాగమణి, సత్యనారాయణ మార్చురీ వద్దకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డకు ఎటువంటి జబ్బు లేదని తల్లిదండ్రులు తెలిపారు.
Advertisement
Advertisement