
ప్రాణం తీసిన ఈత సరదా
► చెరువులో మునిగి చిన్నారి మృతి
► ఎర్రవురెడ్డిపాళెంలో విషాదం
రేణిగుంట: మండలంలోని తూకివాకం పంచాయతీ ఎర్రమరెడ్డిపాళెంలో బుధవారం ఈతకు వెళ్లి చిన్నారి మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... ఎర్రవురెడ్డిపాళెంకు చెందిన వుల్లిక, హరి దంపతుల కువూరుడు సిద్దు(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వుూడవ తరగతి చదువుతున్నాడు. చిన్నారి తల్లిదండ్రులు సమీపంలోని ఓ కర్మాగారంలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో బుధవారం వుధ్యాహ్నం తవు ఇంటికి సమీపంలో ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు ఐదుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. దుస్తులను గట్టున పెట్టి నీటిలోకి దిగాడు.
అక్కడ లోతైన గుంత ఉండడంతో మునిగిపోయాడు. స్నేహితులు కేకలు వేస్తూ గ్రావుంలోకి పరుగులు తీశారు. స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సిద్దును కాపాడేందుకు ప్రయత్నించారు. బాలుడు బురదలో కూరుకుపోయి ఊపిరాడరక మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కళ్ల వుుందు తిరుగుతున్న కొడుకు కాసేపటికే విగతజీవిగా వూరడంతో తల్లిదండ్రులు చేస్తున్న ఆర్తనాదాలు విని పలువురు కంటతడి పెట్టారు. గ్రావుంలో విషాదఛాయులు అలువుుకున్నారుు.