
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మందుబాబులు రెచ్చిపోయారు. కర్ఫ్యూ అంక్షలను ఏ మాత్రం పట్టించుకోకుండా మెయిర్ రోడ్డుపై మందు పార్టీ చేసుకున్నారు. రామంతపూర్‌లోని టీవీ స్టూడియో ప్రధాన ద్వారం ముందు, పోలీస్ చెక్‌పోస్ట్‌కు కూత వేటు దూరంలో మందు బాబులు దర్జాగా పార్టీ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మెయిన్ రోడ్డుపై కొందరు మందు పార్టీ చేసుకునేది పోలీసులు గమనించినా ప్రేక్షకపాత్రే వహించారని, సంఘటనా స్థలానికి మీడియా చేరుకోగానే అప్రమత్తమైన పోలీసులు వారిపై పిటీ కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని స్థానికలు విమర్శిస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినా సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.