Curfew To Be Relaxed In 8 Districts Of Andhra Pradesh From July 1 - Sakshi
Sakshi News home page

ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

Published Mon, Jun 28 2021 1:39 PM | Last Updated on Mon, Jun 28 2021 6:51 PM

Covid19 Curfew Relaxations In 8 Districts Of Andhra Pradesh - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కరోనా పాజిటివిటీ రేటు ఆధారంగా సడలిపులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండనుంది. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత కొనసాగుతుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సడలింపు జిల్లాలివే...
అనంతపురం, కర్నూలు,గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం.తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ఉంటుంది. ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో పూర్తి సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు.

కరోనా నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష
కోవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలను ముఖ్యమంత్రికి వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 44,773 ఉన్నాయని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 7998 ఉన్నారన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 5,655. రికవరీ రేటు 96.95 శాతం, పాజిటివిటీ రేటు 4.46 శాతం ఉందని తెలిపారు. 8 జిల్లాల్లో ప్రస్తుతం 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదయ్యిందన్నారు. గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, వైయస్సార్‌ కడప, అనంతపురం, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు జిల్లాలో 5 కంటే తక్కువ పాజిటివిటీ ఉందన్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులలో  93.62 శాతం బెడ్లు, ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. 104 కాల్‌ సెంటర్‌ ద్వారా వచ్చిన కాల్స్‌  868 మాత్రమేనని అధికారులు వివరించారు.

బ్లాక్‌ ఫంగస్‌
బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 3329
చికిత్స పొందుతున్నవారు 1441 
 మృతి చెందినవారు 253 
 డిశ్చార్జ్‌ అయినవారు 1635 

థర్ఢ్‌ వేవ్‌ సమాచారం నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలతో కార్యాచరణను సీఎంకు వివరించిన అధికారులు
థర్డ్‌వేవ్‌ వస్తుందన్న సమచారంతో ఇప్పటికే మూడు దఫాలుగా నిపుణులతో వెబినార్‌ నిర్వహించామన్న అధికారులు
కొత్త వైద్యులకు కూడా ఈ వెబినార్‌లో చర్చించిన అంశాలతో అవగాహన కలిగించాలన్న సీఎం
టెలీమెడిసిన్‌ కూడా అందుబాటులో తెస్తున్నామన్న అధికారులు

సైకలాజికల్‌‌ కౌన్సిలింగ్‌
కోవిడ్‌ బాధితులకు మానసిక నిపుణులతో సలహాలు, సూచనలు అందిస్తున్నామన్న అధికారులు
190 మంది సైకియాట్రిస్టులు, 16 మంది క్లినికల్‌ సైకాలజిస్టులుతో కౌన్సిలింగ్‌
సీఎంకు వివరించిన అధికారులు
ఐసీఎంఆర్‌  గైడ్‌లైన్స్‌ ప్రకారం సైకలాజికల్ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నామన్న అధికారులు
అవసరమైన వారికి మందులు కూడా అందిస్తున్నామని వెల్లడి
దీన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించిన సీఎం

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే... :
ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపు
8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపు
రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేయాలి
రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కొనసాగనున్న కర్ఫ్యూ
ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు 
ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ  
ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున నిర్ణయం
జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తింపు
పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈజిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం 

ధర్ధ్‌ వేవ్‌– సన్నద్ధత
కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ సమాచార నేపథ్యంలో 104 ద్వారా పిల్లలకు చికిత్స
24 గంటలూ అందుబాటులోకి పీడియాట్రిక్‌ టెలీ సేవలు
150 మంది పీడియాట్రిషియన్లు టెలీ సేవలు
ఇది ప్రారంభించే ముందు పీడియాట్రిషియన్ల అందరికీ శిక్షణ ఇప్పించాలి
దీనికోసం ఎయిమ్స్‌లాంటి అత్యుత్తమ సంస్ధల నిపుణుల సేవలను వినియోగించుకోవాలి
జిల్లాల్లో సంబంధిత జేసీలను కూడా 104 సేవల్లో భాగస్వామ్యం చేయాలి
వారి ఓనర్‌షిప్‌ ఉండాలి
అడ్మిషన్లు అవసరమైతే తక్షణమే స్పందించి వారికి బెడ్లు ఇప్పించాలి
దీనికి అనుగుణమైన వ్యవస్థను బలోపేతం చేయండి
కోవిడ్‌ యేతర కేసులకూ 104 ద్వారా ఈ పద్ధతుల్లో సేవలు అందాలి
సీజనల్‌ వ్యాధులకూ 104 కాల్‌సెంటర్‌ ద్వారా సేవలు అందాలి
విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలతోపాటు 104 కూడా ఆరోగ్యశ్రీకి రిఫరెల్‌ పాయింట్‌గా వ్యవహరించాలి
మనం ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులను నియమించాం
మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేశాం
ప్రతి వైద్యుడు నెలకు రెండుసార్లు గ్రామాల్లో పర్యటించాలి
ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్‌నెస్‌ రెండూ ఉండేటట్లు రన్‌ చేయాలి

 
చదవండి: ‘హుజురాబాద్‌ ఎన్నిక కోసమే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement