
ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
హైదరాబాద్: ఓ ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం రామాంతాపూర్‌లోని ఇందిరానగర్‌లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం ఉదయం రితు అనే ఎయిర్‌హోస్టెస్ తన నివాసంలో శవమై ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎయిర్ హోస్టెస్ రితుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.
అయితే అక్కడి వైద్యులు రితు తలమీద తీవ్ర గాయాలు ఉన్నట్టుగా నిర్థారించారు. దాంతో రితు మృతి విషయంలో ఆమె భర్త సచిన్ ను పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దంపతులు రితు, సచిన్ ల స్వస్థలం జార్ఖండ్. వారిద్దరూ 2013లో రితు, సచిన్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు.