air hostes
-
ఎయిర్‌హోస్టస్ కేసులో నిందితుడి అరెస్టు
అత్తాపూర్: ఎయిర్‌హోస్టస్‌పై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఉమేందర్ కథనం ప్రకారం... ఉప్పర్‌పల్లి హ్యాపిహోమ్స్ ప్రాంతానికి చెందిన యువతి (24) ఓ ఎయిర్‌లైన్ సంస్థలో ఎయిర్‌హోస్టస్. సోమవారం అర్దరాత్రి మందులు కొనుగోలు చేయడానికి డెయిరీ ఫామ్ సమీపంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెంబర్ 216 వద్దకు వచ్చింది. షాపులు మూసి వేయడంతో రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడి ఉన్న ఆమె వద్దకు క్యాబ్ (క్వాలీస్ కారు) వచ్చి ఆగింది. డ్రైవర్ ఆమెకు మాయమాటలు చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు. ఔటర్‌రింగ్‌రోడ్డు... కిషన్‌గూడ మీదుగా శంషాబాద్ హిమాయత్‌సాగర్‌కు తీసుకొచ్చి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి అరవడంతో సెన్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడు వాడిన క్యాబ్ ( నెం. ఏపీ 09ఎక్స్ 2865)ను గుర్తించారు. నిందితుడు కిస్మత్పూర్ గ్రామానికి చెందిన కారు డ్రైవర్ మీర్జా అహ్మద్‌బేగ్ అలియాస్ ఇమ్రాన్‌ను గండిపేటలో బుధవారం అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
-
ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
హైదరాబాద్: ఓ ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం రామాంతాపూర్‌లోని ఇందిరానగర్‌లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం ఉదయం రితు అనే ఎయిర్‌హోస్టెస్ తన నివాసంలో శవమై ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎయిర్ హోస్టెస్ రితుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు రితు తలమీద తీవ్ర గాయాలు ఉన్నట్టుగా నిర్థారించారు. దాంతో రితు మృతి విషయంలో ఆమె భర్త సచిన్ ను పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దంపతులు రితు, సచిన్ ల స్వస్థలం జార్ఖండ్. వారిద్దరూ 2013లో రితు, సచిన్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. -
ఇక విమానంలో ఫోన్ స్విచాఫ్ చేయక్కర్లేదు!
ఫ్లైట్ మోడ్‌లో వాడుకోవచ్చన్న డీజీసీఏ న్యూఢిల్లీ: విమానం పైకి ఎగిరే సమయంలో ఎయిర్‌హోస్టెస్ వస్తుంది.. ‘‘దయచేసి మీ మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేయండి’’ అని అంటుంది... ఇంతవరకు భారత్‌లో ఏ విమానం ఎక్కినా ఇదే సీన్. కానీ ఇక నుంచి సీన్ మారబోతోంది. ‘‘దయచేసి మీ మొబైల్ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోండి’’ అని ఎయిర్‌హోస్టెస్ అనబోతోంది!! పౌర విమానయాన డెరైక్టరేట్(డీజీసీఏ) బుధవారం ఈ మేరకు నిబంధనలు సవరించింది. కొత్త నిబంధల ప్రకారం.. పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజ్‌లు(పీఈడీలు).. అంటే సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి వాటిని విమానం ఎగిరే సమయంలో ఫ్లైట్ మోడ్(నాన్ ట్రాన్స్‌మిటింగ్ మోడ్)లో ఉపయోగించుకోవచ్చు. ఇలా ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవడం వల్ల మన హ్యాండ్సెట్ నుంచి కాల్స్ చేసుకోలేకపోవచ్చు, ఈమెయిల్స్ పంపుకోలేకపోవచ్చు, నెట్ వాడుకోలేకపోవచ్చుగానీ.. గేమ్స్ ఆడుకోవచ్చు, ఈమెయిల్స్ టైప్ చేసుకోవచ్చు, ఫొటోలు, వీడియోలు, సినిమాలు చూసుకోవచ్చు. పలు విమానాల్లో వేరే వినోదమేదీ ఉండని దృష్ట్యా ప్రయాణికుల ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఫోన్లలో ఫ్లైట్ మోడ్‌ను అనుమతించాలని చాలా కాలంగా పలు విమానయాన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీల నిబంధనలు పరిశీలించిన అనంతరం డీజీసీఏ తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు దేశాలు ఈ సౌకర్యం వాడుకోవడానికి అవకాశమిస్తున్నాయి. -
వర్ణం : అందాల భరిణెలు
సినిమా తర్వాత అందం తొలి కొలమానంగా తీసుకునే వృత్తి ఎయిర్ హోస్టెస్. ఈ చిత్రం చూస్తే ఇంకో సాక్ష్యం కూడా అక్కర్లేదు. చైనాలో జరిగిన పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ అతిథులకు వీరు స్వాగతం పలకడానికి వచ్చారు. ఈ ప్రభుత్వ సంస్థ చైనాను వేధిస్తున్న అవినీతి, ఆర్థిక వృద్ధి రేటు మందగమనం, సరిహద్దు దేశాలతో సమస్యల గురించి చర్చించింది. ఘోరకలికి వందేళ్లు ఇది చారిత్రక ప్రదేశం ‘క్రిటె డి విమి’. ఫ్రాన్స్‌లో ఉన్న ఈ ప్రదేశం మొదటి ప్రపంచ యుద్ధం చరిత్ర పుటల్లో నమోదై ఉంది. ప్రస్తుతం ప్రముఖ వారసత్వ సంపదగా, చారిత్ర పర్యాటక ప్రదేశంగా పర్యాటకుల మనసులను దోచుకుంటోంది. మొదటి ప్రపంచ యుద్ధం (1914) మొదలై ఈ ఏడాదితో వందేళ్లు కావడంతో అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆడుకునేవి కావు తినేవి ముచ్చటగా ఉన్న ఈ బొమ్మలు రుచిగా ఉంటాయి. ఈ బొమ్మల్ని ఎలా తినాలని ఆలోచిస్తున్నారా... అవి బొమ్మల రూపంలోని కేకులు. తైపే నగరంలో జరుగుతున్న తైపే ఇంటర్నేషనల్ బేకరీ షో సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలోని దృశ్యమిది. ఈ సందర్భంగా నిర్వహించిన వరల్డ్ పాస్ట్రీ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఓ షెఫ్ ఈ బొమ్మ కేకులను తయారుచేశారు. ‘కీ’లు బొమ్మ కాదు ముద్దుగుమ్మ ప్రపంచ ప్రఖ్యాత ప్యాషన్ గారెత్ సృష్టించిన డ్రెస్ ఇది. పారిస్‌లో జరిగిన వింటర్ కలెక్షన్ ఫ్యాషన్ షోలో ఓ ముద్దుగుమ్మ ఇలా ‘కీ’ ఆకారం కలిపి డిజైన్ చేసిన డ్రెస్సును వేసుకుని అందరినీ ఆకట్టుకుంది. -
ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సినీస్టార్
కేరళ: సినీ నటులు తరుచు ఏదో వివాదాల్లో ఉండటం కొత్తమే కాదు. తాజాగా ఇటువంటి ఉదంతమే శనివారం చోటు చేసుకుంది. ఓ హెయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో సినీ స్టార్. కేరళకు చెందిన సినీస్టార్ హైదరాబాద్ లో జరిగే సీసీఎల్ లో పాల్గొనేందుకు విమానం ఎక్కాడు. ఈ క్రమంలోనే హెయిర్ హోస్టస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో విమాన సిబ్బంది అతన్ని విమానం నుంచి దించేశారు. రేపు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో కేరళ స్ట్రైకర్స్ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించనున్నాడు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.