వర్ణం : అందాల భరిణెలు | a story about different things | Sakshi
Sakshi News home page

వర్ణం : అందాల భరిణెలు

Published Sun, Mar 16 2014 1:40 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

వర్ణం : అందాల భరిణెలు - Sakshi

వర్ణం : అందాల భరిణెలు

 సినిమా తర్వాత అందం తొలి కొలమానంగా తీసుకునే వృత్తి ఎయిర్ హోస్టెస్. ఈ చిత్రం చూస్తే ఇంకో సాక్ష్యం కూడా అక్కర్లేదు. చైనాలో జరిగిన పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ అతిథులకు వీరు స్వాగతం పలకడానికి వచ్చారు. ఈ ప్రభుత్వ సంస్థ చైనాను వేధిస్తున్న అవినీతి, ఆర్థిక వృద్ధి రేటు మందగమనం, సరిహద్దు దేశాలతో సమస్యల గురించి చర్చించింది.

 


 
  ఘోరకలికి వందేళ్లు
 ఇది చారిత్రక ప్రదేశం ‘క్రిటె డి విమి’. ఫ్రాన్స్‌లో ఉన్న ఈ ప్రదేశం మొదటి ప్రపంచ యుద్ధం చరిత్ర పుటల్లో నమోదై ఉంది. ప్రస్తుతం ప్రముఖ వారసత్వ సంపదగా, చారిత్ర పర్యాటక ప్రదేశంగా పర్యాటకుల మనసులను దోచుకుంటోంది. మొదటి ప్రపంచ యుద్ధం (1914) మొదలై ఈ ఏడాదితో వందేళ్లు కావడంతో అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 
 

 ఆడుకునేవి కావు తినేవి
 ముచ్చటగా ఉన్న ఈ బొమ్మలు రుచిగా ఉంటాయి. ఈ బొమ్మల్ని ఎలా తినాలని ఆలోచిస్తున్నారా... అవి బొమ్మల రూపంలోని కేకులు. తైపే నగరంలో జరుగుతున్న తైపే ఇంటర్నేషనల్ బేకరీ షో సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలోని దృశ్యమిది. ఈ సందర్భంగా నిర్వహించిన వరల్డ్ పాస్ట్రీ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఓ షెఫ్ ఈ బొమ్మ కేకులను తయారుచేశారు.
 

 

 ‘కీ’లు బొమ్మ కాదు ముద్దుగుమ్మ
 ప్రపంచ ప్రఖ్యాత ప్యాషన్ గారెత్ సృష్టించిన డ్రెస్ ఇది. పారిస్‌లో జరిగిన వింటర్ కలెక్షన్ ఫ్యాషన్ షోలో ఓ ముద్దుగుమ్మ ఇలా ‘కీ’ ఆకారం కలిపి డిజైన్ చేసిన డ్రెస్సును వేసుకుని అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement