సాక్షి, హైదరాబాద్: నగరంలో బిర్యానీ అంటే తెలియనివారు ఉండరు. వారాంతపు సెలవుల్లో బిర్యానీ సెంటర్లల్లో జనాలు బారులు తీరుతారు. అయితే మంచి బిర్యానీ కోసం భాగ్యనగర వాసులు ఎక్కడినైనా వేళ్లడానికి ఆసక్తి చూపుతారు. చిన్నా, పెద్ద ఇష్టంగా ఆరగించే బిర్యానీ.. పెద్ద హోటళ్లలో లభిస్తున్నప్పటికీ సామాన్యులు తినాలంటే మాత్రం భారంగా మారుతోంది. కానీ, హైదరాబాద్‌లో ఇప్పుడు వేడివేడి బిర్యానీ కేవలం రూ. 60 లభిస్తోంది. అది ఎక్కడని అశ్చర్యపోకండి. ఉప్పల్ చౌరస్తా నుంచి రామంతాపూర్‌కు వెళ్లే మార్గంలో ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్‌లో రుచికరమైన బిర్యానీ లభ్యమవుతోంది.
వివరాలు.. ఉదయ్, కిరణ్ అన్నదమ్ములిద్దరు కలిసి స్టార్టప్‌గా ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్ ప్రారంభించారు. బిర్యానీతోపాటు అదనంగా గ్రేవీ, సలాడ్, పెరుగు, స్వీట్, మినరల్ వాటర్ ఇస్తున్నామని తెలిపారు. అయితే ఇది పూర్తిగా శాకాహారంతో కూడిన బిర్యానీ. అయతే తిన్నంత బిర్యానీ పెడతామని పేర్కొన్నారు. ఇటీవలె బిర్యానీ సెంటర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ జనాల్లో ఆదరణ పెరుగుతోందని తెలిపారు. తక్కువ ధర అని నాసిరకం కాకుండా బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. రోజు రూ. 1000 నుంచి రూ.1,500 వరకు పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. రోజు ఎంతో రద్దీగా ఉండే ఉప్పల్-రామంతాపూర్ మార్గంలో రూ.60 చెల్లించి ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్‌లో బిర్యానీ తింటున్నామని, చాలా రుచిగా ఉందని స్థానికులు తెలిపారు.
హైదరాబాద్‌లో రూ. 60కే ‘తిన్నంత బిర్యానీ’
Published Sun, Feb 28 2021 9:58 AM | Last Updated on Sun, Feb 28 2021 12:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment