
సాక్షి, లక్డీకాపూల్ : సాయంత్రం సరదాగా బయటికి వెళ్లి వస్తానని చెప్పిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. యువకుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామంతాపూర్ ప్రాంతానికి చెందిన రోహిత్ మనోజ్ (19)(బబ్లూ) ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అతడి కోసం గాలించినా ఆచూకీ తెలియరాలేదు.
దీంతో అతడి మేనమామ బోడపాటి శ్రీనివాసరావు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. ఇంటినుంచి బయటికి వెళ్లిన సమయంలో రోహిత్ మనోజ్ నలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని వద్ద ఫోన్ కూడా లేదని ,కేవలం స్టూడెంట్ బస్ పాస్ మాత్రమే ఉందన్నారు. అతడి ఆచూకీ తెలిస్తే 9493106929, 9912199554, 98661311010 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: డెక్కన్ మాల్ కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్)
Comments
Please login to add a commentAdd a comment