
హైదరాబాద్: వయసు తేడాలు లేకుండా.. హఠానర్మణాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ మరణాలు ప్రజల్లో భయాందోళన కల్గిస్తున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వాళ్లు.. కార్డియాక్ అరెస్ట్ లేదంటే గుండెపోటుతోనో కుప్పకూలి కన్నుమూస్తున్నారు. తాజాగా.. నగరంలోనూ అలాంటి మరణం ఒకటి సంభవించింది.
షటిల్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు ఓ వ్యక్తి. బుధవారం ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి (46)గా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు ఆయన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్దారించారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: పిల్లలు లేరనే ఆవేదనతో..
Comments
Please login to add a commentAdd a comment