Narayana College Student Suicide Attempt At Amberpet - Sakshi
Sakshi News home page

నారాయణ కాలేజీ వద్ద టెన్షన్‌.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Published Fri, Aug 19 2022 1:32 PM | Last Updated on Fri, Aug 19 2022 2:41 PM

Narayana College Students Parents suicide Attempt At Ramanthapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అంబర్‌పేట్‌లోని నారాయణ జూనియర్‌ కాలేజీ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి కాలేజీ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగి ఉద్రిక్తత నెలకొంది. 

వివరాల ప్రకారం.. నారాయణ కాలేజీకి చెందిన నారాయణ స్వామి అనే విద్యార్థి.. కాలేజీ యాజమాన్యం తనకు టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థి తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ఘటనలో నారాయణ స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. సిబ్బంది వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్‌, మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. 

ఇది కూడా చదవండి: మునావర్ ఫరూకీ కామెడీ షోకి గ్రీన్‌సిగ్నల్‌.. రాజాసింగ్‌ వార్నింగ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement